ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ( Iran President Ebrahim Raisi ) మృతిచెందారు.హెలికాప్టర్ ప్రమాదంలో( Helicopter Crash ) ఆయన మరణించారని ఇరాన్ మీడియా ప్రకటించింది.
ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీమ్ సహాయక చర్యలను చేపట్టింది.నిన్న సాయంత్రం ఇబ్రహీం రైసీ( Ebrahim Raisi ) ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ ప్రమాదానికి గురైందన్న సంగతి తెలిసిందే.
క్రాష్ అయిన హెలికాప్టర్ ను గుర్తించిన అధికారులు ప్రమాదంలో ఎవరూ ప్రాణాలతో బయటపడలేదని ప్రకటించారు.
కాగా డ్యామ్ ప్రారంభోత్సవానికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది.
రైసీ ప్రయాణించిన హెలికాప్టర్ సరిహద్దుల్లోని పర్వతాలపై నుంచి వస్తూ.మంచు ఎక్కువగా ఉండటంతో కూలిపోయింది.
ఈ ప్రమాదంలో రైసీతో పాటు విదేశాంగ శాఖ మంత్రి హుస్సేన్ అమిర్ అబ్దొల్లాహియాన్,( Hossein Amir-Abdollahian ) ఇతర అధికారులు చనిపోయారని తెలుస్తోంది.