టాలీవుడ్ ఇండస్ట్రీలో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) ఒకరు కాగా ఈరోజు తారక్ పుట్టినరోజు కావడంతో సంబరాలు అంబరాన్నంటాయి.తన పుట్టినరోజు సందర్భంగా అభిమానుల గురించి తారక్ స్పెషల్ పోస్ట్ పెట్టగా ఆ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.
తారక్ తన పోస్ట్ పోస్ట్ లో ప్రియమైన అభిమానుల్లారా.నటుడిగా నా ప్రయాణం మొదలైన రోజు నుంచి నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్స్ అని పేర్కొన్నారు.

మీ అసామాన్య ప్రేమకు నేను కృతజ్ఞుడినని జూనియర్ ఎన్టీఆర్ వెల్లడించారు.ఆదివారం రిలీజైన దేవర సాంగ్( Devara song ) కు మీ నుంచి వచ్చిన స్పందన ఎంతో ఆనందాన్నిచ్చిందని తారక్ అన్నారు.సోషల్ మీడియా వేదికల ద్వారా జూనియర్ ఎన్టీఆర్ తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన సెలబ్రిటీలకు విషెస్ చెప్పడం జరిగింది.తారక్ అభిమానులను ఉద్దేశించి పోస్ట్ పెట్టడంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ వేరే లెవెల్ అని దేవర సినిమా నుంచి వచ్చిన అప్ డేట్స్ చూస్తే ఈ సినిమా కచ్చితంగా హిట్ అనిపించుకుంటుందని కామెంట్లు వ్గ్యక్తమవుతున్నాయి.జూనియర్ ఎన్టీఆర్ ఇతర భాషల్లో సైతం సత్తా చాటాల్సిన అవసరం అయితే ఉందని సమాచారం అందుతోంది.దేవర సినిమాలో కామెడీ సీన్స్ మాత్రం ఉండవని కామెంట్లు వినిపిస్తున్నాయి.దేవర మూవీలో జాన్వీ కపూర్ ( Janhvi Kapoor )హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నారు.భారీ క్యాస్టింగ్ తో తెరకెక్కుతుండటం ఈ సినిమాకు ప్లస్ అవుతోంది.జూనియర్ ఎన్టీఆర్ తన కుటుంబ సభ్యులతో గ్రాండ్ గా జరుపుకున్నట్టు తెలుస్తోంది.తారక్ పుట్టినరోజు సందర్భంగా వార్2 సినిమా నుంచి ఎలాంటి అప్ డేట్ రాకపోవడం గమనార్హం.