కుప్పంలో చంద్రబాబు ఓటమి పక్కా.. పెద్దిరెడ్డి కామెంట్లతో షాక్ లో టీడీపీ ఫ్యాన్స్!

2024 ఎన్నికలకు సంబంధించి ఓటర్లకు ఒకింత ఆసక్తి కలిగిస్తున్న నియోజకవర్గాల్లో కుప్పం ఒకటి.కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబును కచ్చితంగా ఓడించాలని గత రెండేళ్ల నుంచి వైసీపీ కష్టపడుతుండగా బాబుకు కుప్పం( Kuppam )లో ఓటమి తప్పదని కొన్ని సర్వేలలో వెల్లడైంది.

 Peddireddy Comments Huge Shock To Tdp Details Here Goes Viral In Social Media ,-TeluguStop.com

అయితే పోలింగ్ తర్వాత ఆ సర్వేలను నిజం చేస్తూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ( Peddireddy Ramachandra Reddy )చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Telugu Ap, Chandra Babu, Cm Ys Jagan, Kuppam-Politics

కుప్పంలో ఈ ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందని చంద్రబాబు ఓటమి నూటికి నూరు శాతం పక్కా అని ఆయన చెప్పుకొచ్చారు.వైసీపీ గతం కంటే ఎక్కువ స్థానాలలో విజయం సాధిస్తుందని ఆయన కామెంట్లు చేశారు.నేను మొదటి నుంచి ఇదే మాట చెబుతున్నానని పెద్దిరెడ్డి చెప్పుకొచ్చారు.

పోలింగ్ శాతం పెరగడానికి మహిళలే కారణమని ఆయన అన్నారు.బాబు( Chandrababu Naidu )కు ఓటమి తప్పదనే పెద్దిరెడ్డి కామెంట్లతో షాకవ్వడం టీడీపీ అభిమానుల వంతవుతోంది
.

Telugu Ap, Chandra Babu, Cm Ys Jagan, Kuppam-Politics

వైసీపీ సంక్షేమ పథకాలే రాష్ట్రంలో పోలింగ్ శాతం పెరగడానికి కారణమని ఆయన చెప్పుకొచ్చారు.జూన్ నెల 4వ తేదీ తర్వాత అన్నీ మాట్లాడదామని పెద్దిరెడ్డి చెబుతున్నారు.ఏపీలో ఎన్నికల ఫలితాలు వెలువడటానికి 14 రోజుల సమయం ఉంది.అటు కూటమి ఇటు వైసీపీ గెలుపు విషయంలో కాన్ఫిడెన్స్ ప్రదర్శిస్తున్న నేపథ్యంలో ఫలితాలు ఎవరికి అనుకూలంగా వస్తాయో చూడాల్సి ఉంది.

అటు కూటమి నేతలు ఇటు వైసీపీ నేతలు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.సీమలో వైసీపీకే మెజారిటీ స్థానాల్లో అనుకూల ఫలితాలు వచ్చే ఛాన్స్ ఉండగా ఉత్తరాంధ్రలో సైతం ఇదే పరిస్థితి ఉంది.

అయితే మిగతా జిల్లాలలో కూటమికి సానుకూల పరిస్థితులు ఉన్నా వైసీపీకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి.ఈ ఎన్నికల్లో కూటమి, వైసీపీ ఎన్ని స్థానాలతో సత్తా చాటుతాయో చూడాల్సి ఉంది.

పెద్దిరెడ్డి కామెంట్స్ వైసీపీ ఫ్యాన్స్ లో మాత్రం జోష్ నింపాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube