ఎన్టీఆర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన పవన్ కళ్యాణ్..!!

నేడు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు( Jr NTR Birthday ).దీంతో చాలామంది సినిమా సెలబ్రిటీలు రాజకీయ నాయకులు ఎన్టీఆర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

 Pawan Kalyan Wishes Ntr Happy Birthday , Pawan Kalyan, Ntr, Devara ,jr Ntr Birt-TeluguStop.com

ఈ రకంగానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ మేరకు జనసేన పార్టీ తరఫున ఎన్టీఆర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అంటూ సంచలన పోస్ట్ పెట్టారు.“ప్రముఖ కథానాయకుడు శ్రీ ఎన్టీఆర్ గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.ఆస్కార్ పురస్కారాలు అందుకున్న ‘ఆర్.ఆర్.ఆర్.’ చిత్రంతో అంతర్జాతీయ స్థాయిలో సినీప్రియుల మెప్పు పొందారు.

తనదైన అభినయం, నృత్యంతో ప్రేక్షకుల అభిమానాన్ని దక్కించుకున్న శ్రీ ఎన్టీఆర్ గారు మరిన్ని విజయాలు అందుకోవాలని, సంపూర్ణమైన సంతోషాన్ని పొందాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను”.అంటూ పోస్ట్ పెట్టడం జరిగింది.ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కొత్త సినిమా “దేవర( Devara )” నుండి సాంగ్ మే 19 వ తారీకు రిలీజ్ చేయడం జరిగింది.

RRR సినిమా హిట్ తో ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్ క్రేజ్ పెరిగింది.దీంతో “దేవర” మూవీ చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.అంతేకాకుండా ఆగస్టు నెల నుండి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయబోయే ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతుందని నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసి స్పష్టం చేయడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube