సిరివెన్నెల సీతారామశాస్త్రి జీవితాన్ని మార్చేసిన ఏకైక పాట.. ఏంటో తెలుసా..

“నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని”, “జామురాతిరి జాబిలమ్మా”, “ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది” అంటే సూపర్ హిట్ పాటలను రాసి బాగా ఫేమస్ అయ్యారు సిరివెన్నెల సీతారామశాస్త్రి( Sirivennela Sitaramasastri ).మెరుగైన సాహిత్యంతో ప్రతి పాట ద్వారా ఆలోచింపజేయగల గొప్ప లిరిసిస్ట్.సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన పాటలు వింటే సామాజిక స్పృహ పెరుగుతుంది చాలా విజ్ఞానం కూడా లభిస్తుంది.1986లో సినీ గేయరచయితగా సీతారామశాస్త్రి మారారు.ఇప్పటికీ ఈయన రాసిన పాటలను వింటూ మైమరిచిపోయే తెలుగు శ్రోతలు ఎందరో ఉన్నారు.

 This Song Gave Life To Sirivennela,sirivennela Sitaramasastri ,nandi Awards ,b-TeluguStop.com
Telugu Gopal, Balapam Patti, Bobbili Raja, Nandi Awards, Venkatesh-Movie

సీతారామశాస్త్రి బెస్ట్ సాంగ్ లిరిసిస్ట్ గా 1986 నుంచి వరుసగా మూడేళ్లు నంది అవార్డులను ( Nandi Awards )గెలుచుకున్నారు.కానీ అవేమీ ఆయనకు సంతృప్తిని మిగిల్చలేదు.జానకి సినిమా ఇండస్ట్రీ ఆయనకు పెద్దగా డబ్బులు కూడా ఇవ్వలేదు.

రాసిన పాటలకు వచ్చే డబ్బులు సరిపోక మద్రాసు నుంచి తట్టాబుట్టా సర్దుకుని తిరిగి స్వస్థలమైన కాకినాడకు వెళ్లారు.అక్కడ ఉద్యోగం చేసుకుని బతకాల్సిన పరిస్థితి వచ్చింది.కె.విశ్వనాథ్ సిరివెన్నెల సినిమాలో పాటలు రాసే అవకాశాన్ని సీతారామశాస్త్రికి అందించారు.ఆ పాటలు బాగా హిట్ అయ్యాయి సంగీతపరమైన సినిమాల్లో పాటలు రాసే అవకాశాలు ఎన్నో వచ్చాయి.అయితే అప్పట్లో డబుల్ మీనింగ్స్ పాటలు కమర్షియల్ పాటలకే ఎక్కువగా డబ్బులు వచ్చేవి కానీ అవి ఇష్టం లేక సీతారామశాస్త్రి డబ్బులతోనే సరిపెట్టుకునేవారు.

Telugu Gopal, Balapam Patti, Bobbili Raja, Nandi Awards, Venkatesh-Movie

అయితే ఒకసారి ప్రముఖ దర్శకుడు బి.గోపాల్( B Gopal ) తన సినిమాకి పాట రాయమని సిరివెన్నెల సీతారామశాస్త్రిని అడిగారు.బీ గోపాల్ అన్ని కమర్షియల్ సినిమాలను తీస్తాడు ఆయన సినిమాలోని పాటలు కూడా అంతే ఘాటుగా ఉంటాయి.ఆ కారణం చేత సిరివెన్నెల పాట రాయడానికి ఇష్టపడలేదు.

డబుల్‌ మీనింగ్‌ పాట రాయాల్సి వస్తుందనేది ఆయన భయం.కానీ బి.గోపాల్ ఆ పాటలో ద్వంద్వర్థాలు ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.మాములు ప్రేక్షకులకు కూడా అర్థమయ్యేలా సులభమైన తెలుగులో పాట రాసిస్తే సరిపోతుందని చెప్పారు.

దాంతో సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆ పాటను రాశారు.దానికి ఇళయారాజా చక్కని ట్యూన్‌ ఇచ్చారు.

అలా మొదటిసారి సీతారామశాస్త్రి ఓ కమర్షియల్‌ పాట రాసినట్లు అయింది.ఆ పాట మరేదో కాదు బొబ్బిలి రాజా సినిమాలోని సూపర్ హిట్ సాంగ్ ‘బలపం పట్టి భామ బళ్ళో అఆ ఇఈ నేర్చుకుంటా.

’ ఈ పాట ఒక్కటే కాదు సినిమా కూడా సూపర్ సూపర్ హిట్ అయింది అందువల్ల సిరివెన్నెల సీతారామశాస్త్రి మంచి పేరు వచ్చింది.ఆయనకు ఎన్నో మంచి కమర్షియల్ సాంగ్స్ రాసే అవకాశాలు వచ్చాయి.

దీంతో ఆయన జీవితమే మారిపోయింది.ఆర్థికంగా కూడా బాగా స్థిరపడగలిగారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube