ఆరోగ్యంగానే కాకుండా అందంగా ఉండాలంటే ఫిట్నెస్ సాధించాలి.డైలీ వర్కవుట్స్, వాకింగ్, జాగింగ్, రన్నింగ్ ఎక్సర్‌సైజులతో ఫిట్‌గా ఉండటం సాధ్యమే.
సామాన్య ప్రజలు ఫిట్‌న ఉన్న లేకపోయినా ఎవరూ ఏమనరు కానీ హీరోలు, హీరోయిన్లు ఫిట్‌గా లేకపోతే నెటిజన్లు దారుణంగా టోల్ చేస్తారు.సిలిండర్, పరుపు అని, అంత లావు ఉందేంటి ఇటువంటి బాడీ షేమింగ్ కామెంట్లు చేస్తారు.
దీని వల్ల చాలామంది హీరోయిన్లు కాన్ఫిడెన్స్ కోల్పోయి మానసికంగా కుంగిపోతుంటారు.బక్కగా తయారయ్యి ఇలాంటి నెగటివ్ కామెంట్స్ నుంచి తప్పించుకోవాలనుకుంటారు.
అయితే కొంతమంది హీరోయిన్లు కష్టపడి నాజుగ్గా తయారైనా నెటిజన్ల నుంచి ట్రోలింగ్ ఎదుర్కొన్నారు.ఆ అన్‌లక్కీ హీరోయిన్లు ఎవరో తెలుసుకుందాం.
రకుల్ ప్రీత్ సింగ్
రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh ) లౌక్యం, పండగ చేస్కో, సరైనోడు, ధృవ, నాన్నకు ప్రేమతో వంటి సినిమాలతో సూపర్ పాపులర్ అయింది.తాను నటించిన స్పైడర్ సినిమా ఫ్లాప్ అయ్యాక ఈ తార టాలీవుడ్ ఇండస్ట్రీని వదిలేసింది.
హిందీలో ఆయ్యారీ మూవీతో అక్కడ అరంగేట్రం చేసింది.ఆ సినిమా ప్రమోషన్స్ టైమ్‌లో రకుల్ చాలా సన్నగా తయారై కనిపించింది.
అయితే అంతకు ముందు కొద్దిగా ఉన్న ఆనందం చాలా మంది ట్రోల్ చేశారు.బక్కగా కనిపించినప్పుడు కూడా విమర్శించారు.
కీర్తి సురేష్

కీర్తి సురేష్ మహానటి( Mahanati ) సినిమాలో బొద్దుగా కనిపించింది తర్వాత సన్నగా కావడంతో పూర్తిగా అందం కోల్పోయింది.దీనివల్ల చాలామంది చబ్బిగా ఉన్నప్పుడే బాగున్నారు, బక్కగా అయితే అసలు బాగాలేదు.ఏదైనా జబ్బు వచ్చిందా అంటూ ప్రశ్నించి ఇబ్బందికి గురి చేశారు.ఇప్పుడు ఈ తార మళ్లీ హెల్తీ వెయిట్ గెయిన్ చేసింది.
రాశి ఖన్నా

రాశి ఖన్నా ఊహలు గుసగుసలాడే సినిమాలో బొద్దుగా అందంగా కనిపించింది.తర్వాత చాలా సన్నగా కనిపించింది.అప్పుడు ఆమెను బాడీ షేమింగ్ చేశారు.కానీ వీటిని తన అస్సలు పట్టించుకోనని రాశి ఖన్నా చెబుతుంటుంది.
షాలిని పాండే
అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలిని పాండే( Shalini Pandey ) ఫస్ట్ సినిమాలో కాస్త బొద్దుగా, చాలా ముద్దుగా కనిపించి ఆకట్టుకుంది.అయితే సినిమా అవకాశాల కోసం ఆమె సన్నగా తయారైంది కానీ అందంగా మాత్రం కనిపించలేకపోయింది.
దీనివల్ల బక్కగా కనిపిస్తుంటే అసలు బాలేదని ఎగతాళి చేశారు.
శృతి హాసన్

శృతిహాసన్ కొంచెం బొద్దుగా ఉంటేనే బాగుంటుంది.అయితే సన్నగా అయిన ఆమెను ట్రోల్ చేశారు.క్రాక్ సినిమాలో శృతి హాసన్ బక్కగా తయారై కనిపించింది.
అనుపమ పరమేశ్వరన్
రౌడీ బాయ్స్ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ బక్కగా కనిపించి షాక్ ఇచ్చింది.కానీ బొద్దుగా ఉన్నప్పుడే బాగుందని చాలామంది కామెంట్ చేశారు.
హన్సిక
హన్సిక( Hansika ) మస్కా సినిమాలోని కాస్త బొద్దుగా ఉంటూ చాలా బాగుంది.సన్నగా అయ్యాక బాగా ట్రోల్స్ వచ్చాయి
.