భారతీయ సమాజంలో పెళ్లికి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు.కుటుంబ వ్యవస్దకు, వ్యక్తుల మధ్య అనుబంధానికి పెళ్లే మూలస్తంభం.
తమకు వచ్చే జీవిత భాగస్వామి గురించి యవ్వనంలో అడుగుపెట్టిన నాటి నుంచే ఎన్నో కలలు కంటుంటారు యువతీ, యువకులు.ఇక తమ వంశంలో ఎవరూ చేయని విధంగా తమ కొడుకు, కూతురి పెళ్లి చేయాలనుకునే తల్లిదండ్రుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
పెళ్లి తంతు గతాని కంటే భిన్నంగా మారిపోతోంది.ప్రీ వెడ్డింగ్ షూట్‌లు, మెహందీ ఫంక్షన్, హల్దీ ఫంక్షన్, సంగీత్ , డెస్టినేషన్ వెడ్డింగ్, గ్రాండ్ రిసెప్షన్ .ఇలాంటివి వచ్చి చేరాయి.దీంతో పెళ్లి చేయడమనేది ఇప్పుడు ఖరీదైన వ్యవహారంగా మారిపోయింది.
ఒకరిని చూసి మరొకరు.పరువు ప్రతిష్టల కోసం ఇంకొందరు పెళ్లిని కాస్ట్‌లీ వ్యవహారంగా మార్చేశారు.
పరిస్ధితులు ఇలాగే కొనసాగితే పేద, మధ్యతరగతి వర్గాలు పెళ్లిళ్లు చేయాలంటేనే వణికిపోయే పరిస్ధితులు వచ్చాయి.

అయితే పంజాబ్‌కు( Punjab ) చెందిన ఎన్ఆర్ఐ జంట( NRI Couple ) మాత్రం తమ పెళ్లిని ఆదర్శవంతంగా జరుపుకుని అందరి ప్రశంసలు పొందుతోంది.ఫిరోజ్‌పూర్( Ferozepur ) జిల్లాలోని కరి కలాన్ గ్రామానికి చెందిన దుర్లభ్ సింగ్,( Durlabh Singh ) హర్మాన్ కౌర్‌లు( Harman Kaur ) కెనడాలో( Canada ) స్థిరపడ్డారు.వీరిద్దరూ తమ పెళ్లిని సాంప్రదాయ పంజాబీ వివాహాల ఆడంబరానికి బదులుగా .పంజాబ్ వ్యవసాయ మూలాలను గుర్తుచేసుకునే విధంగా జరుపుకోవాలని భావించారు.

ఆచారానికి భిన్నంగా వధువు తన పెళ్లి బరాత్‌తో కలిసి ఊరేగింపుగా వరుడి ఇంటికి చేరుకుంది.కొద్దినెలల క్రితం జరిగిన రైతుల ఆందోళనల( Farmers Protest ) నుంచి ప్రేరణ పొంది బహిరంగ ప్రదేశాలలో అది కూడా పొలంలో తమ వివాహాన్ని జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు.వేదిక నుంచి అలంకరణలు, బహుమతుల వరకు ప్రతి అంశం రైతులతో కనెక్ట్ అయ్యేలా ఈ జంట జాగ్రత్తలు తీసుకున్నారు.
వివాహానికి వచ్చిన వారికి మొక్కలను, తేనే బాటిళ్లను బహుమతులుగా అందించి పంజాబ్ వ్యవసాయ ఉత్పత్తులకు ప్రతీకగా నిలిచారు.
రైతులు మన సమాజానికి, దేశానికి వెన్నెముక లాంటి వారిని.
అందుకే మా పెళ్లిని వారి పోరాటానికి అంకితం చేస్తున్నామని దుర్లభ్, హర్మాన్ కౌర్ తెలిపారు.ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషలో మీడియాలో వైరల్ అవుతున్నాయి.