మీరు పెద్ద పెద్ద భవంతులు, రాజ భవనాలు చూసే ఉంటారు.కానీ ఫోన్ బూత్ అంత చిన్న ఇంటి గురించి ఎప్పుడైనా విన్నారా, యూట్యూబర్ లెవీ కెల్లీ( Levi Kelly ) రీసెంట్‌గా ప్రపంచంలోనే అతి చిన్న, అన్ని సౌకర్యాలు ఉన్న ఇల్లు కట్టి అందరినీ షాక్ కి గురిచేశాడు.
ఈ చిట్టి ఇంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ ఇల్లు కేవలం 1.8 చదరపు మీటర్లు (19.46 చదరపు అడుగులు) మాత్రమే.కానీ రోజువారీ జీవితానికి కావాల్సినవన్నీ ఇందులో ఉన్నాయి.చూడటానికి ఫోన్ బూత్ లాగా అనిపించినా.ఇది చక్రాల మీద తిరిగే ఒక చిన్న ఇల్లు.( Smallest House ) ఇందులో బెడ్ రూమ్, కిచెన్, టాయిలెట్ అన్నీ ఉన్నాయి.
ఇది ఏదో బొమ్మ ఇల్లు కాదు.నిజంగా మనుషులు ఉండడానికి వీలైన ఇల్లు.ఒక్క మనిషి మాత్రమే పట్టేంత చిన్నగా ఉన్నా ఒక పెద్ద మనిషి నిలబడటానికి, కూర్చోవడానికి, పడుకోవడానికి కూడా కంఫర్ట్ గా ఉంటుందని లెవీ చెబుతున్నాడు.

లెవీ ఒకసారి ప్రపంచంలోనే అతి చిన్న ఇల్లు( World’s Smallest House ) అని చెప్పే ఓ ఇంటిని చూశాడు.అది చూసి తను ఇంకా చిన్నది కట్టాలని ఫిక్స్ అయ్యాడు.అనుకున్నదే తడవుగా నెల రోజుల్లోనే ఈ చిట్టి ఇంటిని డిజైన్ చేసి, ఒక ట్రైలర్ మీద కట్టేశాడు.
ఇది చిన్నగా ఉన్నా ఈ ఇంట్లో ఫీచర్లు మాత్రం అదిరిపోతాయి.చిన్నదే అయినా, ఈ ఇంట్లో ఫీచర్లు మాత్రం చాలా ఉన్నాయి.కూర్చోవడానికి సోఫా లాంటి ప్లేస్, పడుకోవడానికి బెడ్, వంట చేసుకోవడానికి కిచెన్, టాయిలెట్, చదువుకోవడానికి ఒక చిన్న ప్లేస్, ఇంకా మినీ ఫ్రిడ్జ్, కూలింగ్ యూనిట్‌తో నీళ్ల ట్యాంక్, వాటర్ హీటర్, ఫిల్టర్, పంప్ సిస్టమ్, ఎలక్ట్రిక్ కుక్ టాప్ వంటివన్నీ ఉన్నాయి.ఇవన్నీ లెవీ కేవలం రూ.21,500 (సుమారు 260 డాలర్లు) ఖర్చుతోనే కట్టేశాడు.

ఈ ఇంటికి ఒకటే చిన్న డ్రా బ్యాక్ ఏంటంటే.ఇందులో షవర్ మాత్రం లోపల లేదు.ప్లేస్ తక్కువగా ఉండటం వల్ల షవర్‌ను ఇంటి బయట క్యాంపింగ్ స్టైల్‌లో పెట్టాడు.
కానీ ఇది పెద్ద సమస్య కాదని, కావాలంటే లోపల కూడా షవర్ పెట్టుకోవచ్చని లెవీ అంటున్నాడు.
లెవీ కట్టిన ఈ ఇల్లు సైజుతో సౌకర్యానికి సంబంధం లేదని నిరూపిస్తోంది.
క్రియేటివిటీ, స్మార్ట్ డిజైన్ ఉంటే చిన్న ప్లేస్‌లో కూడా అన్ని సౌకర్యాలతో ఇల్లు కట్టుకోవచ్చని లెవీ చేసి చూపించాడు.నిజంగా గ్రేట్ కదా అని వీడియో చూసినోళ్లు కామెంట్లు చేస్తున్నారు.
https://youtu.be/diWQtuN1irc?si=gXiJkpdJTapuBWqd ఈ లింక్ మీద క్లిక్ చేసి వీడియో చూడవచ్చు.







