టాలీవుడ్ హీరో డార్లింగ్ ప్రభాస్( Prabhas ) గురించి మనందరికీ తెలిసిందే.ప్రభాస్ కి దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు.
మిలియన్ల కొద్దీ అభిమానులను సంపాదించుకున్నారు ప్రభాస్.ప్రభాస్ పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేవి పాన్ ఇండియా సినిమాలు వేలకోట్ల వసూళ్లు.
బాహుబలి( Baahubali ) సినిమా నుంచి ప్రభాస్ క్రేజ్ పూర్తిగా మారిపోయిందని చెప్పాలి.ఆయన ప్రస్తుతం చేస్తున్న సినిమాల పెట్టుబడులు కలెక్షన్లు ఇలా అన్నీ కూడా వేలు, వందల కోట్లలో ఉన్నాయని చెప్పాలి.
ఇకపోతే మామూలుగా ప్రభాస్ కు డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్న విషయం తెలిసిందే.

ఆయన సినిమాలు విడుదల అవుతున్నాయి అంటే చాలు థియేటర్ల వద్ద అభిమానులు సృష్టించే హంగామా అంతా ఇంతా కాదని చెప్పాలి.ఆ సంగతి పక్కన పెడితే ప్రభాస్ పేరు మీద ఏకంగా ఒక ఊరు ఉంది అన్న విషయం మీలో చాలామందికి తెలియదు.తాజాగా ఇదే విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
ఏంటి హీరో ప్రభాస్ పేరు మీద ఒక ఊరు ఉందా అంటే అవునండోయ్ మీరు విన్నది నిజమే.ఇంతకీ ఆ ఊరు ఎక్కడ ఉంది ఏంటి అన్న వివరాల్లోకి వెళితే.
ఒక తెలుగు యూట్యూబర్ విదేశాలను చుట్టేస్తూ యూట్యూబ్ లో వీడియోలు చేస్తూ అందుకు సంబంధించిన వీడియోలను యూట్యూబ్ లో షేర్ చేస్తూ వస్తున్నాడు.అలా నేపాల్ లో( Nepal ) పర్యటిస్తున్నాడు.

అయితే అనుకోకుండా అక్కడ ప్రభాస్ పేరుతో ఒక ఊరు బోర్డు కనిపించింది.వెంటనే అందుకు సంబంధించిన ఫోటోలను వీడియోలను తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు సదరు యూట్యూబర్.దాంతో ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అయితే ఈ ఊరికి మొదటి నుంచి ప్రభాస్ పేరు ఉందని తెలుస్తోంది.ఏదేమైనా డార్లింగ్ హీరో ఫ్యాన్స్ మాత్రం తన అభిమాన హీరో పేరుపై ఏకంగా నేపాల్ లో ఊరు ఉందని తెగ మురిసిపోతున్నారు.ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోని ఇంస్టాగ్రామ్ లో యూట్యూబ్ లో తెగ వైరల్ చేస్తున్నారు.
చాలామంది నిజమా అంటూ ఒకింత ఆశ్చర్యం కూడా వ్యక్తం చేస్తున్నారు.ఇకపోతే డార్లింగ్ ప్రభాస్ విషయానికి వస్తే ప్రస్తుతం బోలెడు పాన్ ఇండియా మూవీలతో బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న హీరోలలో మొదటి స్థానంలో ఉన్నారు డార్లింగ్ ప్రభాస్.