టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna ) గురించి మనందరికీ తెలిసిందే.బాలయ్య బాబు ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు.
బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ జోష్ మీద ఉన్నారు.ఇటీవల కాలంలో వరుసగా నాలుగు సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే.
అఖండ సినిమా నుంచి డాకు మహారాజ్( Daaku Maharaaj ) సినిమా వరకు ప్రతి సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది.ఇకపోతే బాలయ్య బాబు ఇటీవల నటించిన చిత్రం డాకు మహారాజ్.
ఈ సినిమా ఇటీవలే విడుదల అయ్యి మంచి సక్సెస్ అయిన విషయం తెలిసిందే.

బాబీ దర్శకత్వం( Director Bobby ) వహించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.ఇకపోతే తాజాగా ఈ సినిమాపై సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ( Paruchuri Gopala Krishna ) స్పందించారు.ఈ మేరకు ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ.బాలయ్య బాబును వైవిధ్యంగా చూపించడానికి కొండవీటి దొంగ గెటప్ వేశారు.
చదువుకున్న వాళ్లు ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నామనే బాధ కలిగినప్పుడు కొందరు కొన్ని అవతారాలు ఎత్తుతారు.ఇందులో బాలయ్య బాబు డాకు మహారాజ్ అవతారం ఎత్తారు.
ఆ పాత్రలో హీరో ఏం చేశాడన్నదే ఈ కథ.

నిప్పుల్లో నుంచి బాలకృష్ణ రావడం లార్డ్ ఆఫ్ డెత్, ప్రాణాలు ఇచ్చే దేవుడిని కాదు.తప్పు చేసిన వారి ప్రాణాలు తీసే దేవుడిని అన్న అర్థంలో వచ్చే డైలాగ్ లు వింటే అసలు కథేంటో మేధావులకు ఇట్టే అర్థమైపోతుంది.ఇదంతా శ్రీకృష్ణుడి నుంచి స్ఫూర్తి పొంది రాసుకున్నదే.
ఆయన్ను భగవంతుడిగా చూస్తాము.ఆయన ఎంతమంది నిర్మూలనకు కారణమయ్యాడో అందరికీ తెలుసు.
ఆయన తలుచుకుంటే భారత యుద్ధాన్ని కూడా ఆపగలడు.నిప్పులో నుంచి హీరో రావడమంటే అతను అగ్ని పునీతుడని అర్థం.

బాలయ్య పాత్రను ఎలివేట్ చేయడానికి అద్భుత సంభాషణలు రాశారు.బాబీ కొత్త అంశాన్ని సృష్టించలేదు.కానీ మొదటి నుంచి చివరి వరకూ చక్కగా కథను నడిపారు.నాకు దుష్మన్ లు తక్కువ.ప్రాణాలిచ్చే అభిమానులు ఎక్కువ అనే డైలాగ్ బాలయ్యకు సరిగ్గా సరిపోతుంది.ఆయన్ను దగ్గరి నుంచి చూసి వాళ్లకు ఈ విషయం బాగా తెలుసు.
కథాంశాలనేవి చాలా తక్కువగా ఉంటాయి.చాలా సినిమాల్లో అవే పునరావృతం అవుతుంటాయి.
డాకు మహారాజ్ సినిమాలో చైల్డ్ సెంటిమెంట్ ను అద్భుతంగా రాసుకున్నారు.మహిళా ప్రేక్షకులకు ఇది బాగా కనెక్ట్ అవుతుంది.
ప్రతి ఒక్కరి హృదయాన్ని ఆకర్షించే మాటలు బాలయ్యతో చెప్పించారు అని పరుచూరి అని చెప్పుకొచ్చారు పరుచూరి గోపాలకృష్ణ.ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.