అర్జున్ రెడ్డి సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగ…( Sandeep Reddy Vanga ) ఆయన చేసిన ప్రతి సినిమా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేస్తూ వస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.మరి ఇలాంటి సందర్భంలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న ఈ దర్శకుడు ఇప్పుడు ప్రభాస్ తో( Prabhas ) ‘స్పిరిట్’( Spirit Movie ) అనే సినిమా చేస్తున్నాడు.
మరి ఈ సినిమాతో కూడా పాన్ వరల్డ్ ఇండస్ట్రీని షేక్ చేయాలని చూస్తున్నాడు.అయితే ఈ సినిమా పాన్ ఇండియా పరిధిని దాటి పాన్ వరల్డ్ లో తెరకెక్కుతున్న విషయం మనకు తెలిసిందే…

ఇక ప్రభాస్ ఇప్పటికే వరుసగా సలార్, కల్కి లాంటి రెండు సినిమాలతో సూపర్ సక్సెస్ లను అందుకొని ఉన్నాడు.ఇక ఇప్పుడు హను రాఘవపూడి దర్శకత్వంలో చేస్తున్న ఫౌజి సినిమాతో కూడా మరోసారి తన కంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని ఏర్పాటు చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు.ఇప్పటికే ఆల్మోస్ట్ షూటింగ్ చివరి దశలో ఉన్న రాజాసాబ్( Rajasaab ) సినిమా కూడా తొందర్లోనే రిలీజ్ కి రెడీ అవుతుంది.

ఇక బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో వరుసగా ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మీద దండయాత్ర చేయబోతున్నాడు.మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన చేస్తున్న సినిమాలు ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాయి.ఎలాంటి రికార్డులను కొల్లగొట్టబోతున్నాయనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది… మరి సందీప్ రెడ్డి వంగ లాంటి దర్శకుడితో సినిమా అంటే ఆషామాషీ వ్యవహారం కాదు.ప్రభాస్ ని బోల్డ్ లుక్ లో చూపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు.
మరి ప్రభాస్ అభిమానులు ఆయన బోల్డ్ లుక్ లో చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.మొత్తానికైతే సందీప్ ప్రభాస్ ని ఇప్పటివరకు ఎవరు చూపించని ఒక కొత్త ధోరణిలో చూపించబోతున్నాడనేది క్లారిటీగా తెలుస్తోంది…
.