పొటాటో టర్టిల్( Potato Turtle ) అనే కొరియన్ యూట్యూబర్( Korean Youtuber ) ఇండియాకి ట్రిప్ వేసింది.అక్కడ జనాలు తననే చూస్తుండటంతో ఆమెకు కాస్త ఇబ్బందిగా అనిపించింది.“ఇక్కడ అందరూ నన్నే చూస్తున్నారు” అంటూ తన ఫ్రస్ట్రేషన్‌ని బయటపెట్టింది.జైపూర్‌లో( Jaipur ) తిరుగుతుండగా ఒక ఇండియన్ వ్యక్తి తన వైపు చూస్తూ కనిపించాడు.
విసుగు చెందిన ఆమె అతన్ని నిలదీయాలని డిసైడ్ అయ్యింది.కొరియన్‌లో “ఏంటి చూస్తున్నావ్?” అని అడిగింది.కోపం తగ్గినాక “నేను నీకు నచ్చానా?” అని కూడా అనేసింది.
అతను అనర్గళంగా కొరియన్‌లో సమాధానం చెప్పడంతో ఆమె షాక్ అయింది.
అతను సింపుల్‌గా “నేను ఇక్కడే పని చేస్తాను” అన్నాడు.ఆశ్చర్యపోయిన ఆమె “నీకు కొరియన్ ఎలా తెలుసు?” అని అడిగింది.అతను గతంలో కొరియాలోని ఒక రెస్టారెంట్‌లో( Restaurant ) పనిచేశానని, అక్కడే లాంగ్వేజ్ నేర్చుకున్నానని చెప్పాడు.

తన తప్పు తెలుసుకున్న పొటాటో టర్టిల్ వెంటనే “వావ్.సారీ” అంటూ క్షమాపణ చెప్పింది.ఈ ఊహించని సంఘటన ఆమెను, ఆమె వ్యూయర్స్‌ని షాక్‌కి గురి చేసింది.
ఈ మూమెంట్ వీడియోలో రికార్డ్ అవ్వడంతో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది.చాలా మంది ఇది ఫన్నీగా ఉందని కామెంట్స్, జోకులు పేల్చారు.

నెటిజన్లు కామెంట్లతో మోత మోగించారు.ఒకరేమో “అంకుల్ గారు ఏకంగా కొరియన్ లాంగ్వేజ్( Korean Language ) ప్యాక్ ఇన్‌స్టాల్ చేసుకున్నారే” అని నవ్వేశారు.ఇంకొకరు “అసలే కొరియన్ మాట్లాడే ఇండియన్ దొరకడం కష్టం, కానీ అసాధ్యం కాదుగా” అంటూ ఛమత్కరించారు.“బ్రో మాత్రం డ్యూలింగో యాప్ ఛాలెంజ్‌లన్నీ పూర్తి చేసేశాడు అంతే” అని ఒక కామెంట్, “బ్రో ఈ మూమెంట్ కోసమే జన్మంతా వెయిట్ చేసుంటాడు” అని మరొక కామెంట్.ఇంకాస్త వెటకారంగా “బ్రో ఏకంగా VPNకి కనెక్ట్ అయి ఉంటాడు బాసూ” అంటూ కామెంట్ల వర్షం కురిపించారు.
పొటాటో టర్టిల్ తన ఇన్‌స్టాగ్రామ్ ప్రకారం 100 బకెట్ లిస్ట్ ఎక్స్‌పీరియన్స్‌లను కంప్లీట్ చేసే జర్నీలో ఉంది.
ఇండియా విజిట్ అందులో ఒక పార్ట్ అంతే.ఈ ఊహించని కల్చరల్ ఎక్స్ఛేంజ్.
ఈ గ్లోబల్ ఎరాలో ప్రపంచం ఎంత చిన్నదో చూపిస్తుంది కదా.
.







