టాలీవుడ్ హీరో డార్లింగ్ ప్రభాస్( Prabhas ) ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా మూవీలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే.ప్రస్తుతం ప్రభాస్ చేతిలో అరడజన్ కు పైగా పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి.
ఈ సినిమాలో ఒకదాని తర్వాత ఒకటి విడుదల కానున్నాయి.ఇందులో ప్రస్తుతం ప్రభాస్ రాజా సాబ్( Rajasaab ) మూవీలో నటిస్తున్నారు.
ఈ సినిమా ఏప్రిల్ 10న విడుదల కానున్నట్లు ఇప్పటికే మూవీ మేకర్స్ ప్రకటించారు.ఈ సినిమా తర్వాత హనురాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఫౌజీ( Fauji ) సినిమా విడుదల కానుంది.

ఈ సినిమాలతో పాటు ఇంకా కొన్ని సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి.ఈ సినిమాలో ఇంకా విడుదల కాకముందే ప్రభాస్ ఇప్పుడు మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.ఆ సినిమా మరేదో కాదు ప్రశాంత్ వర్మ( Prashanth Varma ) మూవీ.మీరు విన్నది నిజమే ఇప్పుడు టాలీవుడ్‌లో కొత్త కాంబినేషన్ సెట్ కాబోతోంది.హీరో ప్రభాస్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కలిసి ఒక సినిమాకి పని చేయనున్నారని టాక్.అతి త్వరలోనే ప్రభాస్ లుక్ టెస్ట్ లో పాల్గొననున్నారని సమాచారం.
హనుమాన్ మూవీతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ప్రశాంత్ వర్మ బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ తో బ్రహ్మరాక్షస్( Brahmarakshas ) అనే ప్రాజెక్టు తెరకెక్కించనున్నారని గతంలో వార్తలు వినిపించిన విషయం తెలిసిందే.ఆ మైథాలాజికల్ స్టోరీనే ప్రభాస్ బాడీ లాంగ్వేజ్ కు అనుగుణంగా మార్చి, తెరకెక్కించనున్నట్టు సినీ వర్గాల్లో వినిపిస్తోంది.

దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.ఒకవేళ ఇదే నిజమైన సెట్స్ పైకి వెళ్లేందుకు సమయం పట్టే అవకాశాలు ఉన్నాయట.ఎందుకంటే ప్రభాస్ ఇప్పటికే వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.ఇప్పటికే ప్రకటించిన చిత్రాలు పూర్తి చేసేందుకు ఇంకా చాలా సమయం పడుతుంది.ఒకవేళ ఆ సినిమాలన్నీ పక్కన పెట్టి ప్రశాంత్ వర్మ సినిమా చేస్తే అభిమానులకు నిజంగా అది సర్ప్రైజ్ అని చెప్పాలి.మరి ప్రభాస్ ఏం చేస్తారో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
మరోవైపు హను రాఘవపూడి ఫౌజీ సినిమా కోసం పూర్తి డేట్లు ఇవ్వాలని ఆ సినిమా పూర్తి అయ్యే వరకు పక్కకు వెళ్లడానికి కూడా లేదు అంటూ కండిషన్లు పెట్టినట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి.







