అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా ఒతైన జుట్టును( Thick Hair ) కోరుకుంటారు.జుట్టును దట్టంగా పెంచుకునేందుకు ప్రయత్నిస్తుంటారు.
మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ ఆయిల్ మీకు ఎంతో అద్భుతంగా సహాయపడుతుంది.అబ్బాయిలు కనుక ఈ ఆయిల్ ను వాడితే జుట్టు విపరీతంగా పెరగడం ఖాయం.
ఆయిల్ తయారీ కోసం.
ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో రెండు గింజ తొలగించిన ఉసిరికాయలు,( Amla ) రెండు టేబుల్ స్పూన్లు మెంతులు( Fenugreek Seeds ) వేసి బరకగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో అర లీటర్ కొబ్బరి నూనె( Coconut Oil ) పోసుకోవాలి.
ఆయిల్ లో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉసిరి మెంతుల మిశ్రమాన్ని వేసుకోవాలి.అలాగే రెండు తుంచిన తమలపాకులు, మూడు మందారం ఆకులు, నాలుగు రెబ్బలు కరివేపాకు, నాలుగు ఎండిన మందారం పువ్వులు, రెండు టేబుల్ స్పూన్లు డ్రై రోజ్ మేరీ ఆకులు వేసి దాదాపు పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించాలి.

ఆపై స్టవ్ ఆఫ్ చేసుకుని ఆయిల్ ను చల్లారబెట్టుకోవాలి.పూర్తిగా కూల్ అయ్యాక స్ట్రైనర్ సహాయంతో ఆయిల్ ను( Oil ) ఫిల్టర్ చేసుకుని స్టోర్ చేసుకోవాలి.ఇక ఈ ఆయిల్ ను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి మంచిగా మసాజ్ చేసుకోవాలి.వారానికి రెండుసార్లు ఈ ఆయిల్ ను అప్లై చేసుకోవాలి.
ఆయిల్ అప్లై చేసుకున్న మరుసటి రోజు లేదా నాలుగు గంటల తర్వాత హెయిర్ వాష్ చేసుకోవచ్చు.

ఈ ఆయిల్ ను వాడడం అలవాటు చేసుకుంటే జుట్టు ఎదుగుదల( Hair Growth ) చక్కగా ఇంప్రూవ్ అవుతుంది.జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.ఈ ఆయిల్ జుట్టు రాలడాన్ని అరికడుతుంది.
చుండ్రు సమస్యను దూరం చేస్తుంది.జుట్టును విపరీతంగా పెంచుకోవాలని భావించేవారు తప్పకుండా ఇప్పుడు చెప్పకున్న ఆయిల్ ను తయారు చేసుకుని వాడేందుకు ప్రయత్నించండి.