బాన పొట్ట లేదా బెల్లీ ఫ్యాట్.( Belly Fat ) ఆడ మగ అనే తేడా లేకుండా ఎంతో మందిని కలవరపెట్టే సమస్య.
కొందరు బాన పొట్టను పెద్దగా పట్టించుకోరు.కానీ కొందరు మాత్రం పొట్ట కొవ్వును కరిగించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తుంటారు.
అయితే అలాంటి వారికి ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.రోజు ఉదయం ఏ డ్రింక్ తాగితే మీ బాన పొట్ట మాయం అవ్వాల్సిందే.
ఇంతకీ బెల్లీ ఫ్యాట్ ను దూరం చేసే ఆ డ్రింక్ ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? అన్న విషయాలు తెలుసుకుందాం పదండి.
ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాసు వాటర్ పోసుకోవాలి.
వాటర్ బాయిల్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ మెంతులు,( Fenugreek Seeds ) హాఫ్ టీ స్పూన్ వాము,( Ajwain ) హాఫ్ టీ స్పూన్ జీలకర్ర,( Cumin ) హాఫ్ టీ స్పూన్ సోంపు, రెండు దంచిన యాలకులు, అంగుళం దాల్చిన చెక్క మరియు వన్ టీ స్పూన్ ఫ్రెష్ అల్లం తురుము వేసి మరిగించాలి.దాదాపు 8 నుంచి 10 నిమిషాల పాటు మరిగిస్తే మన డ్రింక్ అనేది రెడీ అవుతుంది.

స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకుని గోరువెచ్చగా అయ్యాక సేవించడమే.రోజు ఉదయం ఈ డ్రింక్ ను తాగడం వల్ల పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు మొత్తం ఐసు ముక్కలా కరిగిపోతుంది.బాన పొట్ట ఫ్లాట్ గా మారుతుంది.అలాగే ఈ డ్రింక్ మెటబాలిజం రేటును పెంచుతుంది.ఇది కేలరీలను కరిగే ప్రక్రియను వేగవంతం చేసి బరువు తగ్గడానికి తోడ్పడుతుంది.

అలాగే ఈ డ్రింక్ శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగిస్తుంది.బాడీని డీటాక్స్ చేస్తుంది.అంతేకాకుండా నిత్యం ఈ డ్రింక్ ను తాగితే గుండెజబ్బులు, మధుమేహం వచ్చే రిస్క్ తగ్గుతుంది.రక్తపోటు అదుపులో ఉంటుంది.మరియు జీర్ణ క్రియ పనితీరు సైతం మెరుగు పడుతుంది.