అసలే పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది.పెళ్లి పీటలెక్కే నవ వధువులు తమ వెడ్డింగ్ డే( Wedding Day ) నాడు అందంగా, ఆకర్షణీయంగా కనిపించాలని ఎంతగా ఆరాటపడుతుంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
అయితే మేకప్ మెరుగలే కాదు సహజంగా చర్మాన్ని కాంతివంతంగా( Glowing Skin ) మార్చుకునేందుకు కూడా ప్రయత్నించాలి.ఈ నేపథ్యంలోనే కాబోయే బ్రైడ్స్ కు( Brides ) ఉపయోగపడే బెస్ట్ స్కిన్ గ్లోయింగ్ రెమెడీస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

రెమెడీ 1:
ముందుగా మిక్సీ జార్ లో నాలుగు కీర దోసకాయ( Cucumber ) స్లైసెస్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి.ఆ తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు శనగపిండి,( Besan Flour ) రెండు టేబుల్ స్పూన్లు కీర దోసకాయ ప్యూరీ మరియు వన్ టీ స్పూన్ పెరుగు( Curd ) వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై వాటర్ తో శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోవాలి.ఈ రెమెడీ చర్మానికి చక్కని హైడ్రేషన్ ను అందిస్తుంది.మురికి, మృత కణాలను తొలగించి చర్మాన్ని సూపర్ గ్లోయింగ్ గా మారుస్తుంది.
చర్మంపై మొండి మచ్చలు ఏమైనా ఉన్నా కూడా వాటిని తొలగిస్తుంది.

రెమెడీ 2:
మిక్సీ జార్ లో నాలుగు బీట్ రూట్( Beetroot ) స్లైసెస్ ను వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ బియ్యం పిండి,( Rice Flour ) వన్ టీ స్పూన్ పెరుగు మరియు సరిపడా బీట్ రూట్ జ్యూస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేసుకుని పూర్తిగా ఆరబెట్టుకోవాలి.
ఆపై వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఈ రెమెడీని పాటించడం వల్ల స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవుతుంది.
చర్మం అందంగా కాంతివంతంగా మారుతుంది.మృదువైన మెరిసే చర్మాన్ని మీ సొంతం చేయడంలో ఈ రెమెడీ చాలా బాగా సహాయపడుతుంది.







