కొన్ని సినిమాలను ప్రముఖ నటీనటులు వేర్వేరు కారణాల వల్ల మిస్ చేసుకుంటూ ఉంటారు.కలర్ ఫోటో సినిమా( Color Photo Movie ) ఓటీటీలో విడుదలై సుహాస్,( Suhas ) చాందిని చౌదరిలకు( Chandini Chowdary ) మంచి పేరు తెచ్చిపెట్టిన సంగతి తెలిసిందే.అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ తనకు వచ్చిందని తాను మిస్ చేసుకున్నానని ప్రియ వడ్లమాని( Priya Vadlamani ) చెబుతున్నారు.2015 సంవత్సరంలో నా ప్రయాణం మొదలైందని ఆమె తెలిపారు.
ఫేస్ బుక్ ద్వారా నాకు ఒక సినిమాలో ఆఫర్ వచ్చిందని ప్రియ వడ్లమాని వెల్లడించారు.వాళ్లు మరీమరీ అడిగే సరికి ఆ సినిమాకు నేను ఓకే చెప్పానని ఆమె తెలిపారు.
అడిషన్ అయిందని సినిమా చేశానని అయితే కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయిందని ప్రియా వడ్లమాని వెల్లడించారు.ఆ తర్వాత ప్రేమకు రెయిన్ చెక్, శుభలేఖలు, హుషారు సినిమాలు ఒకేసారి చేశానని ఆమె పేర్కొన్నారు.

హుషారు సినిమాలో ఉండిపోరాదే పాట( Undiporaadhey Song ) అంత పెద్ద హిట్ అవుతుందని నేను అస్సలు ఊహించలేదని ప్రియా వడ్లమాని కామెంట్లు చేశారు.కలర్ ఫోటో సినిమాలో ఛాన్స్ దక్కిందని అది నాకు సరైన ప్రాజెక్ట్ అని ఆ సమయంలో అనిపించలేదని ఆమె పేర్కొన్నారు.ఆ సమయంలో ఏ సినిమాకు ఓకే చెప్పాలి? ఏ సినిమాను వదులుకోవాలి? అనే ఆలోచన కూడా నాకు లేదని ఆమె చెప్పుకొచ్చారు.

నాకు సినిమా బ్యాగ్రౌండ్ లేదని గైడ్ చేసేవారు కూడా లేరని ఆమె వెల్లడించారు.అమ్మ, నాన్న, నేను కలిసి సినిమాల విషయంలో నిర్ణయం తీసుకునే వాళ్లమని ఆమె అన్నారు.ఆ సమయంలో నాకు కొంచెం సమయం కావాలని అడిగానని ప్రియా వడ్లమాని పేర్కొన్నారు.
ప్రియా వడ్లమాని చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ప్రియా వడ్లమాని కెరీర్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది.