మహా శివరాత్రి పండుగ కానుకగా సందీప్ కిషన్( Sundeep Kishan ) హీరోగా రీతూ వర్మ( Ritu Varma ) హీరోయిన్ గా రావు రమేష్, అన్షు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన మజాకా సినిమా( Mazaka Movie ) విడుదలైంది.త్రినాథరావు నక్కిన డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా కావడం, కామెడీ ప్రధానంగా తెరకెక్కడం, ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాపై ఒక వర్గం ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడటం గమనార్హం.సందీప్ కిషన్ 30వ సినిమాగా ఈ సినిమా తెరకెక్కింది.
కథ :
కృష్ణ (సందీప్ కిషన్), వెంకట రమణ ( రావు రమేష్) తండ్రీ కొడుకులు కాగా వెంకట రమణ కొడుకు కృష్ణకు పెళ్లి చేయడమే లక్ష్యంగా పెట్టుకుని ఉంటాడు.అయితే కొడుకు పెళ్లికి కొన్ని సమస్యలు ఎదురవడంతో తను పెళ్లి చేసుకుని కొడుక్కి పెళ్లి చేయాలని వెంకట రమణ( Venkata Ramana ) ఫిక్స్ అవుతాడు.అదే సమయంలో వెంకటరమణకు యశోద(అన్షు) తారసపడుతుంది.
కృష్ణ కూడా మీరా (రీతూ వర్మ) ప్రేమలో పడతాడు.

తండ్రీ కొడుకులు తమ ప్రేమల గురించి ఒకరికొకరు ఎప్పుడు చెప్పుకున్నారు? భార్గవ్ వర్మ( మురళీ శర్మ) తండ్రీ కొడుకులపై పగతో రగిలిపోవడానికి కారణమేంటి? పెళ్లికి సిద్ధమైన తర్వాత ఎలాంటి సమస్యలు వచ్చాయి? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.

విశ్లేషణ :
సినిమాలో కొన్ని సన్నివేశాలు మొదట నవ్వు తెప్పించినా లాజిక్ కు అందకుండా ఉండే ఆ సీన్లు కొన్నిసార్లు చిరాకు కూడా తెప్పిస్తాయి.డబుల్ మీనింగ్ డైలాగ్స్ లేకపోవడం ప్లస్ అయినా కథ, కథనంలో మరీ కొత్తదనం లేకపోవడం ఈ సినిమాకు మైనస్ అయింది.ఫస్టాఫ్ అద్భుతంగా ఉన్నా సెకండాఫ్ అదే స్థాయిలో లేదు.క్లైమాక్స్ బాగానే ఉన్నా దర్శకుడు త్రినాథరావు నక్కిన( Director Trinadharao Nakkina ) మరిన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఈ సినిమా రేంజ్ పెరిగేది.
ప్లస్ పాయింట్లు :
ఫస్టాఫ్
క్లైమాక్స్
కొన్ని కామెడీ సన్నివేశాలు
మైనస్ పాయింట్లు
కథనం
సెకండాఫ్ లో కొన్ని బోరింగ్ సన్నివేశాలు
ఓవర్ ది బోర్డ్ సీన్స్