హెయిర్ ఫాల్( Hair fall ).స్త్రీలు మాత్రమే కాదు ఎందరో పురుషులు కూడా ఈ సమస్యతో తీవ్రంగా మదన పడుతుంటారు.
అయితే ఒక్కొక్కరిలో ఒక్కొక్క కారణం చేత జుట్టు ఊడుతుంటుంది.ఆహారపు అలవాట్లు, పోషకాల కొరత, కాలుష్యం, ఒత్తిడి, హార్మోన్ చేంజ్, పలు రకాల మందుల వాడకం, ధూమపానం, మద్యపానం, నిద్రలేమి వంటివి హెయిర్ ఫాల్ కు ప్రధాన కారణాలుగా మారుతుంటాయి.
అయితే కారణం ఏదైనా హెయిర్ ఫాల్ తో చింతే వద్దు.
ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ ఆయిల్ ను కనుక వాడితే ఒక్క వెంట్రుక కూడా రాలదు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఆయిల్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.ముందుగా ఆరు నుంచి ఎనిమిది వెల్లుల్లి రెబ్బలను తీసుకుని శుభ్రంగా పొట్టు తొలగించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఈ వెల్లుల్లి ముక్కలను కచ్చాపచ్చాగా దంచుకుని పెట్టుకోవాలి.ఆ తర్వాత రెండు బిర్యానీ ఆకులను( Two biryani leaves ) తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి.

ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులో ఒక గ్లాస్ ఆలివ్ ఆయిల్( Olive oil ) ను పోసుకోవాలి.ఆయిల్ హీట్ అవ్వడానికి ముందే అందులో కట్ చేసి పెట్టుకున్న బిర్యానీ ఆకు మరియు దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకుని స్లో ఫ్లేమ్ పై పది నుంచి పన్నెండు నిమిషాల పాటు ఉడికించాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఆయిల్ ను ఫిల్టర్ చేసుకుని చల్లార బెట్టుకోవాలి.పూర్తిగా కూల్ అయిన అనంతరం ఒక బాటిల్ లో నింపుకొని స్టోర్ చేసుకోవాలి.

ఈ ఆయిల్ ను జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేసుకుని బాగా మసాజ్ చేసుకోవాలి.నైట్ నిద్రించే ముందు ఆయిల్ ను రాసుకొని మరుసటి రోజు మైల్డ్ షాంపూ తో తలస్నానం చేయాలి.వారంలో కేవలం రెండే రెండు సార్లు ఈ ఆయిల్ ను కనుక వాడితే కుదుళ్లు దృఢంగా మారతాయి.స్కాల్ప్ ఆరోగ్యంగా తయారవుతుంది.జుట్టుకి చక్కటి పోషణ అందుతుంది.ఫలితంగా హెయిర్ ఫాల్ సమస్య అదుపులోకి వస్తుంది.
అదే సమయంలో జుట్టు ఒత్తుగా సైతం పెరుగుతుంది.అంతేకాదు ఈ ఆయిల్ ను వాడితే చుండ్రు సమస్య నుంచి కూడా విముక్తి పొందుతారు.