శర్వానంద్ కి అన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా ?

చిరంజీవి థమ్బబ్ యాడ్ వల్ల వెలుగులోకి వచ్చిన హీరో శర్వానంద్. చిన్న నటుడిగా మొదలెట్టి తన ప్రయాణంలో అనేక సినిమాల్లో నటించి కంటెంట్ ఉన్న సినిమాల్లో నటించే హీరోగా పేరు సంపాదించుకున్నాడు.

 Actor Sharwanand Properties , Actor Sharwanand, Ran Raja Ran, Gayam, Shatamanam-TeluguStop.com

శంకర్ దాదా జిందాబాద్ సినిమాలో చిన్న రోల్ లో నటించి ఆ తర్వాత హీరోగా మారాడు.ఇక ఆ తర్వాత రన్ రాజా రన్, గమ్యం, శతమానం భవతి, ప్రస్థానం, మహానుభావుడు వంటి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలతో గుర్తింపు పొందాడు.

అయితే సినిమా ఇండస్ట్రీ లో శర్వా పై ఒక రూమర్ గట్టిగానే ఉంది.

రెమ్యునరేషన్ తీసుకునే విషయంలో అందరికన్నా ఒక అడుగు ముందుకే ఉంటాడు అనే వాదన బలంగా వినిపిస్తుంది.

ఇదే విషయంపై ఇటీవల ఒక ఇంటర్వ్యూలో శర్వా ని అడగగా తనదైన రీతిలో స్పందించాడు.తాను ఇప్పటివరకు నటించిన సినిమాలు పెద్ద ప్రొడక్షన్ కంపెనీలవి ఎక్కువగా ఉన్నాయని, వారి దగ్గర ఎప్పుడూ తక్కువగా తీసుకోలేదని కానీ చిన్న నిర్మాతలు వస్తే మాత్రం ఖచ్చితంగా తక్కువే తీసుకున్నాను అంటూ చెప్పుకొచ్చాడు.

Telugu @actorsharwanand, Sharwanand, Gayam, Mahanubhavadu, Prasthanam, Ran Raja

ఇక మీరు బాగా రిచ్ అని, హైదరాబాదులో ప్రతి ఏరియాలో మీకు స్థలాలు ఉన్నాయని, ఈ సిటీలో మూడు వంతుల భాగం మీదేనట కదా అని ప్రశ్నించగా అందుకు శర్వా ఈ విధంగా బదులిచ్చాడు.మీరు చెప్పినంత కాకపోయినా మా అమ్మ నాన్న బాగానే సంపాదించారు నేనే సొంతంగా సినిమాలు తీసుకోగలరు కెపాసిటీ ఉంది అంటూ చెప్పుకొచ్చాడు.ఇక శర్వా ఆస్తుల విషయం బయటకు రాగానే సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.ఇక శర్వానంద్ సినిమాల విషయంలో ఫ్లాప్ వచ్చినప్పుడు తన రెమ్యూనరేషన్ తిరిగి ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి.

అలాగే తమ ముగ్గురం పిల్లలమని 19 ఏళ్ల వయసు వచ్చాక ఇంట్లో డబ్బులు అడగడం మానేశానని ప్రస్తుతం మేమంతా కూడా బాగానే లైఫ్ లో సెటిల్ అయ్యాం అంటూ చెప్పుకొచ్చాడు శర్వానంద్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube