నేటి పంచాంగాలు, గోడ క్యాలెండర్లలో మనం తరచుగా చూసేది రాహుకాలం.అయితే దీని గురించి ప్రజలు అనవసరంగా భయపడుతుంటారు.
కానీ అంతగా భయపడాల్సిన అవసరం ఏం లేదని చెబుతున్నారు వేద పండితులు.అంతే కాదండోయ్ రాహు కాలం కూడా కొంత మందికి మంచిదేనట.
వారి వారి జాతకాల ప్రకారం ఆ సమయంలో చేసే పని వారికి విజయాన్ని ఇస్తుందట.
రాహుకాల గణన చూస్తే… నవ గ్రహాల్లో 7 గ్రహాలకి ఒకరోజు లేదా 24 గంటలు కేటాయించగా… ఛాయా గ్రహాలైన రాహు, కేతువులకు రోజులు లేకుండా పోయాయి.
అందువల్ల రాహు, కేతువుల కోసం ఒక్కో గ్రహం రోజు నుంచి 3 గంటల చొప్పున తీసుకున్నారు.అలా 7 రోజుల నుంచి 3 గంటలు తీసుకుంటే 21 గంటలు వచ్చాయి.
అలా మిగిలిన 7గ్రహాలకు 21 గంటలు మిగిలాయి. రాహు కేతులకు రోజుకు చెరో గంటన్నరను పంచుకున్నాయి.
అయితే రాహు కాలం కూడా మంచిదే అని తమిళులు, కన్నడిగులు అంటారు.అంతే కాకుండా ఆ సమయంలో పూజలు కూడా చేస్తుంటారు.
మన ప్రాంతంలో వర్జ్యం, దుర్ముహూర్తం పాటిస్తే సరిపోతుందని చెబుతారు.అంతే కాకుండా రోజులో వారికున్న గంటన్నర సమయాన్ని రాహు, కేతువులు అంబికను పూజిస్తారు.
అయితే రాహువు అమ్మ వారిని పూజించే సమయాన్ని రాహు కాలంగా, కేతువు అమ్మవారిని పూజించే సమయాన్ని యమ గండంగా పిలుస్తుంటారు.అయితే ఈ సమయంలో ఇతర గ్రహాల ప్రభావం తగ్గి ఉంటుంది కాబట్టి శుభకార్యాలు చేయకూడదు అనేది ఒక నమ్మకం.