దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం సీబీఐ (Delhi liquor scam, CBI )కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ( Kavitha) జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు అయింది.ఈ మేరకు జూన్ 3వ తేదీ వరకు కవితకు సీబీఐ ప్రత్యేక కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగించింది.
కాగా ఈడీ, సీబీఐ(ED, CBI) కేసుల్లో ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ రిమాండ్ ముగిసిన నేపథ్యంలో ఆమెను కోర్టు ఎదుట వర్చువల్ విధానంలో హాజరుపరిచారు అధికారులు.ఈ క్రమంలో విచారణ జరిపిన సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం కవిత జ్యుడీషియల్ రిమాండ్ ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.