ఈరోజు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు( Jr NTR Birthday ) అభిమానులకు పండుగ రోజు అనే సంగతి తెలిసిందే.రెండు తెలుగు రాష్ట్రాల్లో తారక్ అభిమానులు ఆయన పుట్టినరోజును పండుగలా జరుపుకుంటున్నారు.
జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) సాధించిన రికార్డులు సైతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.అయితే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్( Prashanth Neel ) మూవీ నుంచి షాకింగ్ అప్ డేట్ రాగా ఆ అప్ డేట్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది.
తారక్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ ఈ ఏడాది ఆగష్టు నెల నుంచి మొదలుకానుందని అధికారికంగా క్లారిటీ వచ్చేసింది.ఎన్టీఆర్ ఇప్పటికే వార్ 2( War 2 ) షూటింగ్ లో పాల్గొంటుండగా ఆగష్టు నుంచి తారక్ ప్రశాంత్ మూవీ రెగ్యులర్ షూట్ మొదలుకానుంది.
మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తుండటం గమనార్హం.రెండేళ్ల క్రితమే ఈ ప్రాజెక్ట్ ఫిక్స్ అయినా వేర్వేరు కారణాల వల్ల సినిమా ఆలస్యమవుతోంది.

ఈ సినిమాకు డ్రాగన్( Dragon ) అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది.తారక్ పుట్టినరోజు సందర్భంగా షూటింగ్ కు సంబంధించి స్పష్టత రావడంతో 2024, 2025, 2026 సంవత్సరాలలో ఏడాదికి ఒక సినిమా చొప్పున తారక్ సినిమాలు విడుదల కానున్నాయని సమాచారం అందుతోంది.ఈ సినిమా కూడా రెండు భాగాలుగా తెరకెక్కుతోందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

ప్రశాంత్ నీల్ గత సినిమాలకు భిన్నమైన కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కనుందని ఫ్యాన్స్ అంచనాలను మించేలా సరికొత్త లుక్ లో తారక్ ఈ సినిమాలో కనిపిస్తారని ఈ సినిమా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్( NTR Fans ) కాలర్ ఎగరేసే మూవీ అవుతుందని నెటిజన్లు ఫీలవుతున్నారు.ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ అద్భుతమైన స్క్రిప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారని భోగట్టా.2026 సంవత్సరంలో ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.