దేశంలో నానాటికీ పెరుగుతున్న వలసలను తగ్గించడానికి ప్రధాని రిషి సునాక్ ( UK PM Rishi Sunak )సారథ్యంలోని బ్రిటన్ ప్రభుత్వం కఠినమైన చర్యలకు దిగుతున్న సంగతి తెలిసిందే.కొద్దిరోజుల క్రితం ఫ్యామిలీ వీసా నిబంధనలను కఠినతరం చేయడంతో పాటు కనీస వార్షిక వేతన పరిమితిని ఏకంగా 55 శాతం పెంచింది.
తాజాగా బ్రిటన్‌కు చిన్న పడవల్లో అక్రమంగా ప్రవేశించే వలసదారులను నిరోధించడానికి రూపొందించిన పాలసీని పార్లమెంట్ ఆమోదించింది.ఈ నేపథ్యంలో యూకే పోస్ట్ స్టడీ వీసాపై( Post Study Visa ) పరిమితులు విధించే దిశగా సునాక్ కసరత్తు చేస్తున్నారు.
ఇది గ్రాడ్యుయేట్లు వారి డిగ్రీ కోర్సు పూర్తయిన తర్వాత రెండేళ్ల వరకు కొనసాగడానికి, పనిచేయడానికి వీలు కల్పిస్తుంది.మంత్రివర్గంలోని పలువురి నుంచి వ్యతిరేకత ఎదురవుతున్నప్పటికీ.
పెరుగుతున్న చట్టపరమైన వలసలను అరికట్టడానికి కఠిన నిర్యం దిశగానే సునాక్ అడుగులు వేస్తున్నారు.ది అబ్జర్వర్ వార్తాపత్రిక ప్రకారం.గ్రాడ్యుయేట్ రూట్ స్కీమ్‌ను రద్దు చేసే విషయంలో కేబినెట్ నుంచి రిషి సునాక్ తిరుగుబాటును ఎదుర్కొంటున్నారు.2021లో ఈ స్కీమ్ ప్రారంభమైన నాటి నుంచి భారతీయ విద్యార్ధులే ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు.
కాగా.భారతీయ గ్రాడ్యుయేట్ల ఆధిపత్యంలో వున్న పోస్ట్ స్టడీ వీసా మార్గం యూకేలోని యూనివర్సిటీలకు దేశీయంగా ఆర్ధిక నష్టాలను పూడ్చటంతో పాటు దేశ పరిశోధనా రంగాన్ని విస్తరించడంలో సహాయపడుతుందని ఓ నివేదిక పేర్కొంది.యూకే హోం సెక్రటరీ జేమ్స్ క్లెవర్లీ నేతృత్వంలోని ఇండిపెండెంట్ మైగ్రేషన్ అడ్వైజరీ కమిటీ (ఎంఏసీ) .గ్రాడ్యుయేట్ వీసాపై సమీక్షను చేపట్టింది.ఇది అంతర్జాతీయ విద్యార్ధులు తమ డిగ్రీ తర్వాత రెండేళ్ల వరకు పని అనుభవాన్ని సంపాదించుకోవడానికి వీలు కల్పిస్తుంది.
ఈ వీసా కేటగిరీలో భారతీయ విద్యార్ధులు( Indian students ) 2021-2023 మధ్య 89,200 వీసాలు లేదా మొత్తం గ్రాంట్లలో 42 శాతాన్ని కలిగి వున్నారని కమిటీ కనుగొంది.ఎంఏసీ ఛైర్ ప్రొఫెసర్ బ్రియాన్ బెల్ మాట్లాడుతూ.మా సమీక్ష గ్రాడ్యుయేట్ రూట్ అలాగే ఉండాలని సిఫార్సు చేస్తోందన్నారు.
యూకే ఉన్నత విద్యా వ్యవస్థ, సమగ్రతను ఇది అణగదొక్కడం లేదని బ్రియాన్ బెల్ పేర్కొన్నారు.అంతర్జాతీయ విద్యార్ధులు యూకేకి వచ్చి చదువుకోవడానికి తాము అందించే ఆఫర్‌లో ఈ గ్రాడ్యుయేట్ రూట్ కీలక భాగమన్నారు.
ఈ విద్యార్ధులు చెల్లించే ఫీజులు బ్రిటీష్ విద్యార్ధులకు బోధించడంలో, పరిశోధనలు చేయడంలో జరిగే నష్టాలను పూడ్చుకోవడానికి యూనివర్సిటీలకు సహాయపడతాయని బెల్ తెలిపారు.ఆ విద్యార్ధులు లేకుండా యూనివర్సిటీలు కుదించబడితే తక్కువ పరిశోధనలు జరుగుతాయని ఆయన వెల్లడించారు.