ప్రముఖుల వారసులు ఏం చేస్తున్నారనే ఆసక్తి ఇక్కడ ప్రతి ఒక్కరికీ వుంటుంది.ఈ క్రమంలోనే నారాయణమూర్తి( Narayanamurthy ) కొడుకు ఏం చేస్తున్నాడు? అనే ఆలోచన చాలమందికి వస్తుంది? ఇకపోతే నారాయణమూర్తి అనేది ఒక పేరు కాదు, ఒక బ్రాండ్.ప్రజలందరికీ బాగా తెలిసిన పేరు, ఈ ఇన్ఫోసిస్ ఫౌండర్ ఆయన భార్య సుధామూర్తి( Sudhamurthy ) కూడా అందరికీ సుపరిచితురాలే.ఆమె ధనికురాలు మాత్రమే కాదు… ప్రముఖ ఇంజనీర్, వక్త, రచయిత కూడా.
అంతేనా, బ్రిటిష్ ప్రధాని రిషి సునాక్( Prime Minister Rishi Sunak ) అత్తగారు.ఇక వారి బిడ్డ పేరు అక్షత గురించి కూడా అందరికీ తెలిసినదే.
ఇక్కడ పెద్దగా తెలియని పేరు ఒకటుంది.అదే సుధామూర్తి, నారాయణమూర్తిల కొడుకు పేరు రోహన్ మూర్తి.

అవును, అతని వయస్సు 40 ఏళ్లు.కర్నాటకలోని హుబ్బలిలో పుట్టిన రోహన్( Rohan ) అమెరికాలోని కార్నెల్ యూనివర్శిటీలో కంప్యూటర్ సైన్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు.ఆ తరువాత హార్వర్డ్ యూనివర్శిటీలో పీహెచ్‌డీ చేశాడు.ఆ తరువాత సొరొకో అనే స్టార్టప్‌ను( Soroko ) సొంతంగా స్టార్ట్ చేయగా ప్రస్తుతం ఆ కంపెనీ పేరిట దాదాపు 40 పేటెంట్లు వుండడం విశేషం.
నిజానికి మొదట రోహన్ తమ ఇన్ఫోసిస్‌లో ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్‌గా చేరాడు.ఆ తరువాత కొన్ని సంస్థాగత వ్యవహారాలతో విసిగి బయటికి వచ్చేయడం జరిగింది.నిజం చెప్పాలంటే, తన ఆస్తుల విలువ తనకే తెలియదు.అంత పట్టానట్టు వుంటాడు.
ఇన్ఫోసిస్‌లో అత్యధిక షేర్లున్నవాడు.తను సొంతంగా మూర్తి క్లాసికల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా అనే సంస్థను స్థాపించాడు.
అంతేకాకుద్న తన కంపెనీ సొరొకో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్( Soroko Artificial Intelligence ) మీద వర్క్ చేస్తుంటుంది.ఓ రకంగా అతనికి ఫుల్ సెటిల్డ్ ఫ్యామిలి.

కానీ అతని వివాహం జీవితం అనేది కాస్త ఒడిదుడుకులతో సాగింది.టీవీఎస్ గ్రూపు మీకు తెలుసు కదా.వేణు శ్రీనివాసన్ టీవీఎస్ గ్రూపు ఛైర్మన్.అతని భార్య మల్లికా శ్రీనివాసన్ ముద్దుల కుమార్తెని మనోడు పెళ్లి చేసుకున్నాడు.వారి ఇరువురి వివాహం ఎంతో అట్టహాసంగా జరిగింది.2011లో పెళ్లి జరిగితే జస్ట్, రెండేళ్లలోనే, అంటే 2013లో విడిపోయారు.తరువాత మనోడు ఇండియన్ నేవీ మాజీ ఆఫీసర్ కేఆర్ కృష్ణన్ కూతురు అపర్ణా కృష్ణన్‌ను పెళ్లి చేసుకున్నాడు.అపర్ణ తల్లి సావిత్రి స్టేట్ బ్యాంకులో ఉన్నతాధికారిణిగా చేసి రిటైరైంది.
ఎంత హైప్రొఫైల్ సంబంధాలు అయితేనేం… ఆ కుటుంబాల్లో కాస్త ఇగో, యాటిట్యూడ్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ కదా! అందుకే వారి వివాహాలు ఇలా వుంటాయి.