నేడు తెలుగు సినిమా దశాదిశ మారిపోయిందని చెప్పుకోవాలి.ఏ ముహూర్తన దర్శక ధీరుడు బాహుబలి( Baahubali ) తీశాడోగానీ, అప్పటినుండి ప్రపంచం మన తెలుగు సినిమాలవైపు చూడడం మొదలు పెట్టింది.
అక్కడితోనే ఇక్కడ సినిమాల్లో కొత్త ట్రెండ్ మొదలయ్యింది.ఒకప్పుడు సినిమా కేవలం ఒక పార్టుగా మాత్రమే వచ్చేది.
కానీ ఇప్పుడు బడా సినిమాలన్నీ దాదాపుగా 2 పార్టులుగా వస్తున్నాయి.ఎందుకంటే రెండు పార్టులను కూడా దేశ వ్యాప్తంగా ప్రజలు ఆదరిస్తున్నారు కాబట్టి.
ఈ క్రమంలో తెరకెక్కిన “బాహుబలి, కేజీఎఫ్, పొన్నియన్ సెల్వమ్” సినిమాలు ఎంతటి ప్రభంజనం సృస్టించాయో ఇక్కడ వేరే చెప్పాల్సిన పనిలేదు.
మరోవైపు అల్లు అర్జున్ నటించి మెప్పించిన పుష్ప సినిమాకు( Pushpa 2 ) పార్ట్ 2 రాబోతున్న విషయం విదితమే.
ఇంకా మన తెలుగులో అలా రెండు పార్టులతో రాబోతున్న బడా సినిమాల కహానీ ఇక్కడ చూద్దాము.ఇక్కడ ముందుగా ప్రశాంత్ నీల్ ప్రభాస్‌తో చేస్తోన్న ‘సలార్’( Salaar ) మూవీ గురించి మాట్లాడుకోవాలి.
ఈ సినిమాని ప్రశాంత్ నీల్ రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నాడు.కాగా ఈ సినిమా రెండు భాగాలు కలిపి రూ.3000 వేల కోట్లు వసూళు చేయాలనే టార్గెట్ పెట్టుకున్నారట చిత్ర మేకర్స్.ఈ మధ్య ప్రభాస్( Prabhas ) సినిమాలు ఢీలా పడడంతో అభిమానులు ఈ సినిమాపైనే ఆశాలన్నీ పెట్టుకున్నారు.

మరి ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమా ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో వేచి చూడాల్సిందే.తరువాత అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప సినిమా గురించి మాట్లాడుకోవాలి.ఫస్ట్ పార్ట్ సూపర్ హిట్ కావడంతో రెండోపార్ట్ పైన కూడా ఆదేమాదిరి అంచనాలు నెలకొన్నాయి.ఈ చిత్రాన్ని ఆగష్టు 15న వచ్చే యేడాది స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.
ఇదే వరుసలోకి వచ్చి చేరుతుంది ఎన్టీఆర్( NTR ) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కతోన్న ‘దేవర’ సినిమా.( Devara Movie ) కథా రీత్యా స్పాన్ ఎక్కువగా ఉండటంతో ఈ చిత్రాన్ని దర్శకుడు 2 భాగాలుగా తెరకెక్కించబోతున్నట్టు తాజాగా ప్రకటించారు.

ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్‌లో 2 భాగాలుగా రాబోతున్న తొలి చిత్రంగా నిలువనుంది.ఆర్‌ఆర్‌ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిన ఎన్‌టిఆర్ తాజాగా వుత్తమ నటుడి అవార్డుని కూడా పొందడం మనం చూశాం.దాంతో ఇండియా అంతటా వీరి సినిమాలకు మంచి హైప్ వుంది.యేది ఏమైనా ఓ సినిమాని రెండు పార్టులుగా తెరకెక్కించడం అనే కాన్సెప్ట్ కు బాహుబలి పునాది వేసింది అనడంలో అతిశయోక్తి లేదు.
మరోవైపు ఇలాంటి సినిమాలకు ప్రేక్షకుల ఆదరణ కూడా ఎక్కువగా ఉండడంతో ఇలాంటి సినిమాలను నిర్మాతలు తెరకెక్కించడానికి ముందుకు వస్తున్నారు.