సరైన దిండు లేకపోతే ఏమి జరుగుతుందో తెలుసా?

ఉదయం నిద్ర లేవగానే మెడ నొప్పి,మెడ పట్టేసిందని అనిపిస్తే దిండు మార్చాల్సిన సమయం వచ్చిందని అర్ధం చేసుకోవాలి.దిండు కారణంగా పడుకొనే భంగిమ కూడా మారుతుంది.

 Pillows For Neckpain , Heath Tips , Good Health , Pillows , Neckpain , Proper Pi-TeluguStop.com

వెన్నుముకలో ఉండే సహాజమైన వంపులకు సరైన సపోర్ట్.లేకపోతే మెడ నొప్పి వస్తుంది.

ఇలా మెడనొప్పి రాకుండా ఉండాలంటే దిండు ఎలా ఉండాలో తెలుసుకుందాం.

వెన్నుముకలో ఉండే సహాజమైన వంపులు యధావిధిగా ఉండేలా చూసుకోవాలి.

పక్కకు తిరిగి పడుకున్నప్పుడు భుజానికి,మెడకు ఉన్న దూరం యధావిధిగా ఉండాలి.

వేసుకొనే దిండు మీ సహజమైన భంగిమకు అడ్డంకి కాకుండా ఉండాలి.

అప్పుడే మెడ నొప్పి రాకుండా ఉంటుంది.

Telugu Sleep, Heath Tips, Memory Form, Neckpain, Pillows, Proper Pillow-Telugu H

మోల్డెడ్ ఫోమ్ లేదా మెమొరీ ఫోమ్‌తో తయారుచేసిన దిండును వాడాలి.ఎందుకంటే దిండు కొన్ని రోజులు వాడిన తర్వాత అణిగిపోతుంది.దిండు అణిగిపోయినప్పుడుమెడకు సపోర్ట్ లేక మెడ నొప్పి వస్తుంది.

దిండు ఎంచుకొనే సమయంలో ఈ జాగ్రత్త తప్పనిసరి.భుజానికి మెడకు మధ్య ఇమిడిపోయేంత ఎత్తులో దిండు ఉండాలి.

అంతకంటే ఎక్కువ మందంగా ఉండేది, లేదా తక్కువ మందంగా ఉండేది వాడడం వల్ల మెడనొప్పికి ఆస్కారం ఉంటుంది.ఈ చిన్న జాగ్రత్తలు చాలా వరకు మెడనొప్పి నుంచి మిమ్మల్ని దూరంగా ఉంచి సుఖనిద్రకు సహకరిస్తాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube