వర్షాకాలం మొదలైంది.దేశంలోని చాలా ప్రాంతాల్లో మెల్ల మెల్లగా వర్షాలు ఊపందుకుంటున్నాయి.
ఇక వానకాలం అంటేనే రోగాల పుట్ట.జలుబు, దగ్గు, ఫ్లూ, ఆస్తమా, మలేరియా, డెంగ్యూ, డయేరియా ఇలా వివిధ రకాల సమస్యలు తీవ్రంగా సతమతం చేస్తుంటాయి.
వీటి నుంచి రక్షణ పొందాలంటే తప్పకుండా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.అలాగే డైట్‌లో కొన్ని కొన్ని ఆహారాలను తప్పకుండా చేర్చుకోవాలి.
అలాంటి వాటిలో ఓ మూడు ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మొక్కజొన్న.వర్షాకాలంలో తప్పకుండా తీసుకోవాల్సిన ఆహారాల్లో ఒకటి.కేవలం చిరుతిండిగా మాత్రమే మొక్క జొన్న ఉపయోపడుతుందని అస్సలు అనుకోకండి.
ఎందుకంటే, మొక్కజొన్న రుచిగా ఉండటమే కాదు.ఎన్నో అమోఘమైన పోషకాలను కలిగి ఉంటాయి.
ముఖ్యంగా ప్రస్తుత వర్షాకాలంలో తరచూ ఉడకబెట్టిన లేదా కాల్చిన మొక్కజొన్నను తీసుకుంటే ఇన్ఫెక్షన్, ఫ్లూ, డయేరియా వంటివి దరి చేరకుండా ఉంటాయి.జీర్ణ వ్యవస్థ చురుగ్గా మారుతుంది.
రక్తంలోని చక్కెర స్థాయులను అదుపులో ఉంటాయి.

బీట్ రూట్.
ఇదో అద్భుతమైన దుంప.వర్షాకాలంలో ఖచ్చితంగా తీసుకోవాల్సిన దుంప కూడా.
ప్రస్తుత సీజన్‌లో తరచూ బీట్ రూట్ జ్యూస్‌ను తీసుకుంటే రోగ నిరోధక వ్యవస్థ బలపడి సీజనల్ వ్యాధులు దరి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.బీట్ రూట్‌ను తీసుకుంటే రక్తహీనత దూరం అవుతుంది.
వెయిట్ లాస్ అవుతురు.చెడు కొలెస్ట్రాల్ కరిగి గుండె ఆరోగ్యవంతంగా మారుతుంది.
లివర్ శుభ్రపడుతుంది.మరియు బాడీ డిటాక్స్ అవుతుంది.

ఇక వర్షాకాలంలో ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలంటే సీజనల్ ఫ్రూట్స్ అయిన జామ, బొప్పాయి, చెర్రీస్, యాపిల్, పియర్స్, దానిమ్మ వంటి పండ్లను డైట్‌లో చేర్చుకోవాలి.ఈ పండ్లు వర్షాకాలంలో వేధించే వివిధ రకాల జబ్బులు దరి చేరకుండా అడ్డు కట్ట వేసి ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి.