ట్రంప్‌పై హత్యాయత్నం: మహిళా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్‌ విమర్శలు, హోంలాండ్ సెక్యూరిటీ చీఫ్ కౌంటర్

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై( Donald Trump ) హత్యాయత్నంతో అంతర్జాతీయ సమాజం ఉలిక్కిపడింది.అత్యంత శక్తివంతమైన , కట్టుదిట్టమైన భద్రత ఉండే అమెరికాలో ఓ మాజీ అధ్యక్షుడిని చంపే ప్రయత్నం చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది.

 Us Homeland Chief Hits Back At Attacks On Women Secret Service Agents, Us Secret-TeluguStop.com

ఈ నేపథ్యంలో సీక్రెట్ సర్వీస్‌ తీరు, వైఫల్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.యూఎస్ సీక్రెట్ సర్వీస్ డైరెక్టర్ కింబర్లీ చీటిల్( US Secret Service Director Kimberly Cheatle ) తక్షణం రాజీనామా చేయాలంటూ సోషల్ మీడియాలో డిమాండ్లు వినిపిస్తున్నాయి.

అంతేకాదు.ట్రంప్‌పై దాడి సమయంలో మహిళా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ మండిపడుతున్నారు.ఈ నేపథ్యంలో హోంలాండ్ సెక్యూరిటీ చీఫ్( Chief of Homeland Security ) (డీహెచ్ఎస్) ఈ విమర్శలకు కౌంటరిచ్చారు.హంతకుడి బారి నుంచి ట్రంప్‌ను రక్షించడానికి మహిళా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు సాహసం చేశారని, అయినప్పటికీ వారిపై స్త్రీ ద్వేషంతో కామెంట్లు చేస్తున్నారని డీహెచ్ఎస్ చీఫ్ అలెజాండ్రో మేయోర్కాస్( DHS Chief Alejandro Mayorkas ) మండిపడ్డారు.

ఈ వాదనలు నిరాధారమైనవి, అవమానకరమైనవని ఆయన దుయ్యబట్టారు.

Telugu Dhsalejandro, Donald Trump, Law, Homelandhits, Secretkimberly-Telugu NRI

ఇతరుల భద్రత కోసం ఫ్రంట్‌లైన్‌లో నిలబడి తమ ప్రాణాలను పణంగా పెట్టి దేశవ్యాప్తంగా లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలలో( law enforcement agencies ) పనిచేస్తున్న అత్యంత నైపుణ్యం , శిక్షణ పొందిన మహిళలను ఆయన ప్రశంసించారు.వారు ధైర్యవంతులు, నిస్వార్ధ దేశభక్తులని.వారు గౌరవానికి అర్హులని మేయోర్కాస్ పేర్కొన్నారు.

డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యూరిటీ చాలా గర్వంగా, మా లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ర్యాంకుల్లో మహిళలను నియమించడం, నిలుపుకోవడం జరుగుతుందని ఆయన తేల్చిచెప్పారు.

Telugu Dhsalejandro, Donald Trump, Law, Homelandhits, Secretkimberly-Telugu NRI

మరోవైపు.డొనాల్డ్ ట్రంప్‌కు ఉన్న ముప్పును అంచనా వేసే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ వస్తున్న ఆరోపణలపై సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ స్పందించింది.గత కొన్నేళ్లుగా ట్రంప్ శిబిరం నుంచి కొన్ని అభ్యర్ధనలు వచ్చాయని వాటిని తాము తిరస్కరించామని తెలిపింది.

అయితే ట్రంప్‌కు సన్నిహితంగా ఉండే సీక్రెట్ సర్వీస్ సిబ్బంది, ఉన్నతాధికారులకు మధ్య సత్సంబంధాలు లేవనే విమర్శలున్నాయి.ఈ నేపథ్యంలో డీహెచ్ఎస్ చీఫ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube