అమెరికాలో ( America )దారుణం జరిగింది.ఇండియానా రాష్ట్రంలో భారత సంతతికి చెందిన ఓ వ్యక్తిని కాల్చి చంపారు.
కొద్దిరోజుల క్రితం అతనికి పెళ్లవ్వగా.భార్య ముందే అతనిని హత్య చేశారు.29 ఏళ్ల గవిన్ దసౌర్( Gavin Dasaur ) తన మెక్సికన్ భార్యతో కలిసి కారులో ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.ఇండియానాపోలిస్ పోలీస్ డిపార్ట్మెంట్ (ఐఎంపీడీ) అధికారి అమండా హిబ్ష్మాన్ మాట్లాడుతూ.
ఇండీ నగరానికి ఆగ్నేయంగా ఉన్న ఓ కూడలి వద్ద మంగళవారం రాత్రి 8 గంటలకకు ఈ ఘటన జరిగినట్లుగా తెలిపారు.తుపాకీ గాయంతో బాధపడుతున్న వ్యక్తి రోడ్డుపై కనిపించినట్లు అధికారులు వెల్లడించారు.

కాల్పుల్లో తీవ్రగాయమై రక్తస్రావం జరుగుతుండటంతో తాను భర్తని పట్టుకుని అంబులెన్స్ కోసం ఎదురుచూశానని బాధితుడి భార్య వివియానా జమోరా.ది ఇండియానాపోలిస్ స్టార్( The Indianapolis Star )తో చెప్పారు.ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాకు చెందిన దసౌర్, వివియానా జమోరాలు రెండు వారాల క్రితం జూన్ 29న వివాహం చేసుకున్నారు.స్థానిక డబ్ల్యూటీహెచ్ఆర్ నివేదిక ప్రకారం ఓ డ్రైవర్‌తో జరిగిన రోడ్డు రేగ్ (కారు దారి ఇవ్వకపోవడం, అసహనానికి గురవ్వడం) ఘటన వల్లే ఈ హత్య జరిగినట్లు నివేదించింది.
అనుమానాస్పద షూటర్‌ను స్పాట్లోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కాల్పుల ఘటనపై విచారణ కొనసాగుతోందని ఐఎంపీడీ తెలిపింది.సంఘటనా స్థలంలో మరో డ్రైవర్ రికార్డ్ చేసిన సెల్‌ఫోన్ వీడియోలో మృతుడు దసౌర్ తన కారు నుంచి ఆవేశంగా దిగుతున్నట్లు కనిపించింది.దసౌర్ కోపంగా కనిపించాడని, పికప్ ట్రక్ డ్రైవర్‌పై అరుస్తున్నాడని ఫాక్స్ న్యూస్ నివేదించింది.
దసౌర్ కుడిచేతిలో తుపాకీ స్పష్టంగా కనిపించిందని తెలిపింది.పికప్ టక్ డ్రైవర్( Pickup Tuck Driver ) వైపుకు చేరుకోగానే.
దసౌర్ తన చేతిలోని తుపాకీతో ట్రక్కు తలుపును కొట్టి కాల్పులకు దిగాడు.దీంతో పికప్ డ్రైవర్ ఆత్మరక్షణ కోసం తాను కూడా మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు.
ఏడు సెకన్ల పాటు జరిగిన ఘర్షణ సమయంలో షూటర్ తన వాహనం నుంచి బయటకు దిగలేదని తెలుస్తోంది.