తాజాగా జబర్దస్త్ కమెడియన్ శుభవార్త తెలిపాడు.స్టాండ్ అఫ్ కమెడియన్ గా పేరు తెచ్చుకున్న ఆ కమెడియన్ పటాస్ షోలో కామెడీ స్కిట్లతో బుల్లితెరపై ఆడియన్స్ ను కడుపుబ్బ నవ్విస్తాడు.
ఇక టాప్ కామెడీ షో అయినా జబర్దస్త్ లో కూడా అడుగుపెట్టి మంచి పేరును సంపాదించుకుంటూ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాడు.కేవలం బుల్లితెరపై మాత్రమే కాకుండా వెండితెరపై కూడా ప్రయత్నాలు చేస్తూ దూసుకు వెళ్తున్నాడు ఈ కమెడియన్.
ఇంతకీ ఆ కమీడియన్ ఎవరో అనే కదా మీ అనుమానం.మరెవరో కాదండి ఏడాదిన్నర క్రితం పెళ్లి చేసుకున్న యాదమరాజు( Yadamaraju ).తాజాగా తాను తండ్రి కాబోతున్నట్లు వార్తను అందరితో షేర్ చేసుకున్నాడు.దీంతో ఈ పోస్ట్ కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
కామెడీ షోలలో మంచి పేరు తెచ్చుకున్న క్యారెక్టర్ ఆర్టిస్టుగా ( charecter artist ) యాదమ్మ రాజుకు మంచి పేరు ఉంది.మొదట్లో పటాస్ కామెడీ షో తో మొదలుపెట్టిన తన ప్రస్థానాన్ని నెమ్మది నెమ్మదిగా.జబర్దస్త్ ఆపై వెండితెరపై ప్రయత్నాలు చేస్తూ ముందుకు కొనసాగిస్తున్నాడు తన కెరీర్ ని.ప్రస్తుతం కొన్ని సినిమాలలో నటిస్తున్నట్లు కూడా సమాచారం.అలాగే బుల్లితెరపై కూడా కొన్ని షోలలో కమీడియన్ గా కూడా కామెడీ చేస్తూ కొనసాగిస్తున్నాడు.ఏడాదిన్నర క్రితం స్టెల్లాని( Stella ) వివాహం చేసుకున్న యాదమరాజు తాజాగా తాము ఇద్దరం కాస్త ముగ్గురం అవుతున్నట్లుగా తెలుపుతూ ఓ పోస్ట్ చేశాడు.
స్టెల్లా తో దిగిన ఆ ఫోటోలను ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేసిన యాదమరాజు 8 సంవత్సరాల ప్రేమ, ఏడాదిన్నర వైవాహిక సంబంధం ఊహించని సవాళ్లు, కన్నీళ్లు, నవ్వులు ఇలా అన్ని జీవితంలోని ప్రతి క్షణాన్ని మమ్మల్ని మరింత దగ్గరగా చేశాయంటూ.ఇప్పుడు మా బంధం మరింత బలోపేతం కావడానికి మా కుటుంబంలోకి మరొకరు రాబోతున్నట్లు తెలపడానికి తనకి సంతోషంగా ఉందని తెలిపాడు.తాను జీవితంలో కొత్త ప్రయాణాన్ని మొదలు పెట్టేందుకు ఎంతో ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు.మా ఇద్దరి జంటపై మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు, మద్దతుకు ధన్యవాదాలు అంటూ తన ఆనందానికి అక్షర రూపం ఇచ్చారు యాదమ్మ రాజు.
ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చాలామంది వారి జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.