పాన్ ఇండియా స్టార్ హీరో అల్లు అర్జున్( Allu Arjun ) త్వరలోనే పుష్ప 2 ( Pushpa 2 ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సిందిగా కొన్ని కారణాలవల్ల ఆలస్యం అవుతూ డిసెంబర్ 6వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది.ఇలా ఈ సినిమా తరచు వాయిదా పడటంతో ఈ సినిమాకు సంబంధించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సుకుమార్( Sukumar ) అల్లు అర్జున్ మధ్య పెద్ద గొడవ జరిగిందని, దీంతో ఈ సినిమా షూటింగ్ ఆగిపోయిందని వార్తలు వస్తున్నాయి.ఇక ఈ ఏడాది కూడా సినిమా రావడం కష్టమేనని తెలుస్తోంది.
ఈ విధంగా ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో వివిధ రకాలుగా వార్తలు వస్తున్న తరుణంలో బన్నీ స్నేహితుడు నిర్మాత బన్నీ వాసు ( Bunny Vasu ) ఇటీవల ప్రెస్ మీట్ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బన్నీ సుకుమార్ మధ్య గొడవలు గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.ఈ ప్రశ్నకు ఈయన ఆసక్తికర సమాధానాలు చెప్పారు.ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ ఆగిపోయిన మాట వాస్తవమేనని తెలిపారు.కానీ సుకుమార్ అల్లు అర్జున్ మధ్య గొడవలు కారణంగా ఆగలేదని తెలిపారు.
ఈ సినిమాలో అల్లు అర్జున్ షూటింగ్ దాదాపు పూర్తి అయింది.కేవలం 12 రోజుల్లో షూటింగ్ మాత్రమే ఉంది.దీంతో సుకుమార్ ఈ సినిమా షూటింగ్ ఆపేసి ఎడిటింగ్ మొదలుపెట్టారు.
సినిమా ఎంత పోతుంది ఎంత రీషూట్ చేయాలి అనేది క్లారిటీ వస్తుంది.ఈ ఎడిటింగ్ చేయడానికి దాదాపు నెలరోజుల సమయం పడుతుంది.
అందుకే అల్లు అర్జున్ తన గడ్డం కూడా ట్రిమ్ చేసి తన ఫ్యామిలీతో ట్రిప్ వెళ్లారు.సినిమా స్టార్ట్ అవ్వడానికి నెల సమయం పడుతుంది.
ఈలోగా తిరిగి తన గడ్డం పెరుగుతుంది.సినిమా ఎడిటింగ్ కోసమే షూటింగ్ ఆపివేసారే తప్ప ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవని సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్తలన్నీ కూడా ఆ వాస్తవమేనని క్లారిటీ ఇచ్చారు.