ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న టాప్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నాడు జూనియర్ ఎన్టీఆర్. తాతకు తగ్గ మనవడిగా నటనలో డాన్సులలో తనకు తిరుగులేదని నిరూపిస్తున్నాడు.
నటనకు నిలువెత్తు రూపం ఉంటే అది ఎన్టీఆర్ లాగే ఉంటుందేమో అనేలా ప్రేక్షకులను తన నటనతో మేప్పిస్తున్నాడు.అయితే ఎన్టీఆర్ కెరీర్ స్టార్ట్ చేసిన మొదట్లో జూనియర్ ఎన్టీఆర్ ను మాస్ హీరోగా నిలబెట్టిన సినిమా ఏది అంటే అది సింహాద్రి చెప్పాలి.
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన స్టూడెంట్ నెంబర్ 1 సినిమా అందరి చూపు ఎన్టీఆర్ వైపు వచ్చేలా చేస్తే సింహాద్రి సినిమా మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది.

వసూళ్ల పరంగా సింహాద్రి సినిమా నిర్మాతలకు ఇలా లాభాల పంట పండించింది అని చెప్పాలి.సినిమా టీవీలో వస్తుందంటే చాలు ప్రేక్షకుడు అలాగే కన్నార్పకుండా చూస్తూ ఉంటాడు.అయితే రాజమౌళి ని మాస్ హీరోగా నిలబెట్టిన సింహాద్రి సినిమా కు ఇక ఎన్టీఆర్ బాబాయ్ నందమూరి నటసింహం బాలకృష్ణ సూపర్ హిట్ మూవీ చెన్నకేశవరెడ్డి సినిమా కు మధ్య ఒక లింకు ఉంది అనేది హాట్ టాపిక్ గా మారిపోయింది.
అయితే చెన్నకేశవరెడ్డి 2002 లో వస్తే సింహాద్రి 2003 లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.చెన్నకేశవరెడ్డి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కగా సింహాద్రి రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కింది.

చెన్నకేశవరెడ్డి సినిమా విషయానికొస్తే వి.సముద్ర దర్శకత్వంలో తెరకెక్కించాలి అనుకున్నారట.అప్పుడు ఆది షూటింగ్ వినాయక్ దర్శకత్వంలో జరుగుతుంది.చెన్నకేశవరెడ్డి షూటింగ్ ప్రారంభమయ్యే సమయానికి ఆది విడుదలై సూపర్హిట్ అయింది.దీంతో నిర్మాతలు బెల్లంకొండ సురేష్ నిర్ణయాన్ని మార్చుకుని చివరికి వి.సముద్ను పక్కనపెట్టి ఇక వివి వినాయక్ దర్శకత్వం బాధ్యతలు అప్పగించాడట.ఇక సింహాద్రి విషయానికి వస్తే స్టోరీ రెడీ అయిన తర్వాత బాలయ్య బి.గోపాల్ కాంబినేషన్లో సినిమా తీయాలని అనుకున్నారు.ఇక నిర్మాతను కూడా బెల్లంకొండ సురేష్ అనుకున్నారట.కానీ ఆయనకు కథ నచ్చకపోవడం తో నో చెప్పారట.ఇక బాలయ్య కూడా వేరే సినిమాతో బిజీగా ఉండడంతో చివరికి ఎన్టీఆర్ రాజమౌళి కాంబినేషన్ లో ఈ సినిమా వచ్చింది.ఇలా చెన్నకేశవ రెడ్డి కి సింహాద్రి సినిమా కి ముందు అనుకున్న డైరెక్టర్ ఒకరు.
చేసిన డైరెక్టర్ ఒకరు అని చెప్పాలి.