ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఒక సినిమా మంచి సక్సెస్ అయితే తదుపరి ఆ సినిమాకు సీక్వెల్ చిత్రాలు రావడం జరుగుతుంది.ఇప్పటికే ఎన్నో సూపర్ హిట్ సినిమాల సీక్వెల్ చిత్రాలు షూటింగ్ పనులను జరుపుకుంటున్నాయి.
ఈ క్రమంలోనే గత 28 సంవత్సరాల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ చిత్రంగా ఇటీవల భారతీయుడు 2 ( Bharateeyudu 2 ) సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.శంకర్ ( Shankar ) డైరెక్షన్లో కమల్ హాసన్ ( Kamal Hassan ) నటించిన ఈ సినిమాపై ఎన్నో అంచనాలు కూడా ఏర్పడ్డాయి.
ఇలా ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా భారీ డిజాస్టర్ సొంతం చేసుకుంది.దీంతో ఒక్కసారిగా అభిమానులు షాక్ అయ్యారు.అయితే తాజాగా ఈ సినిమా ఫ్లాప్ అవడం గురించి ఒక వార్త సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది.భారతీయుడు 2 సినిమాలో పలువురు సెలబ్రిటీలు కూడా భాగమైన సంగతి మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే నటి రకుల్( Rakul ) సైతం ఈ సినిమాలో నటించారు.దీంతో రకుల్ పట్ల భారీ స్థాయిలో సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి.
నటి రకుల్ సీక్వెల్ సినిమాలలో కనుక నటిస్తే ఆ సినిమాలన్నీ ఫ్లాప్ అవుతాయి అంటూ తాజాగా సోషల్ మీడియాలో ఈమెపై ట్రోల్స్ వస్తున్నాయి.భారతీయుడు 2 మాత్రమే కాకుండా గతంలో ఈమె నటించిన కిక్ 2, మన్మధుడు 2 సినిమాలు కూడా ప్లాప్ అయిన సంగతి మనకు తెలిసిందే.కానీ ఈ సినిమాల మొదటి భాగం అద్భుతమైన విజయాలను సొంతం చేసుకున్నాయి.దీంతో రకుల్ ప్రీత్ కనుక సీక్వెల్ సినిమాలలో నటిస్తే తప్పకుండా ఆ సినిమా ఫ్లాప్ అవుతుంది అంటూ పలువురు ఈమెపై భారీ స్థాయిలో ట్రోల్స్ చేస్తున్నారు.
ఇక రకుల్ తెలుగులో చివరిగా కొండ పొలం ( Konda polam ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా తర్వాత ఈమె తెలుగు సినిమాలకు కమిట్ అవ్వడం లేదు.