350 సంవత్సరాల తర్వాత.. బ్రిటన్ నుంచి భారత్‌కు చేరిన ఛత్రపతి శివాజీ ‘‘వాఘ్ నఖ్ ’’ ..!!

మహారాష్ట్ర ప్రజల ఆరాధ్య దైవం, మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్( Chhatrapati Shivaji Maharaj ) ఉపయోగించిన రహస్య ఆయుధం ‘వాఘ్ నఖ్’ ఎట్టకేలకు భారత్‌కు చేరింది.దాదాపు 350 సంవత్సరాల నిరీక్షణ ఫలించి, ఎన్నో వ్యయ ప్రయాసల తర్వాత ఇది మరాఠా గడ్డను చేరుకుంది.

 Chhatrapati Shivaji Maharaj's Historic 'wagh Nakh' Returns To India From London-TeluguStop.com

బుల్లెట్‌ప్రూఫ్ కవర్‌లో, అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య దీనిని మహారాష్ట్ర ప్రభుత్వం భారత్‌కు తీసుకొచ్చింది.సతారాలోని ఛత్రపతి శివాజీ మ్యూజియంలో దీనిని ప్రజల సందర్శనకు ఉంచారు.

ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ( Eknath Shinde, Deputy CM Devendra Fadnavis )తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.ఇన్నాళ్లూ యూకే రాజధాని లండన్‌లోని అల్బర్ట్ మ్యూజియంలో ఈ ఆయుధం ఉంది.

దీనిని ప్రజల సందర్శనకు అందుబాటులో ఉంచాలని భావించిన మహారాష్ట్ర ప్రభుత్వం .బ్రిటన్ సర్కార్‌తో( British government ) మూడేళ్ల తాత్కాలిక ప్రాతిపదికన భారత్‌లో ఉంచేందుకు ఒప్పందం చేసుకుంది.సతారాలో ఏడు నెలల పాటు వాఘ్ నఖ్‌ను ప్రదర్శనకు ఉంచుతారు.

Telugu Deputycm, Eknath Shinde, London, Wagh Nakh-Telugu Top Posts

చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం.1649లో ఛత్రపతి శివాజీ బీజాపూర్ సుల్తాన్‌ను ఓడించి మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించారు.ఈ క్రమంలో బీజాపూర్ సేనాని అఫ్జల్ ఖాన్‌‌ను పులి గోళ్ల మాదిరిగా తయారు చేసిన ‘వాఘ్ నఖ్’’ ( Wagh Nakh )అనే ఆయుధంతో అంతం చేశాడు శివాజీ.

‌‌ఈ ఘటన ప్రతాప్‌గఢ్ కోటలో జరగ్గా.ఇది ప్రస్తుతం సతారా పరిధిలో ఉంది.ఛత్రపతి శివాజీ అనంతరం ఆయన వారసులు ఈ ఆయుధాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారి జేమ్స్ గ్రాంట్ డఫ్‌కు( James Grant Duff ) అందజేశారు.ఆయన దీనిని బ్రిటన్‌కు తీసుకెళ్లగా.

అనంతరం డఫ్ వారసులు వాఘ్ నఖ్‌ను అల్బర్ట్ మ్యూజియానికి అందజేశారు.

Telugu Deputycm, Eknath Shinde, London, Wagh Nakh-Telugu Top Posts

అయితే మరాఠా ప్రజల మనోభావాలు, వారసత్వానికి , చరిత్రకు ప్రతీక అయిన ఈ వాఘ్ నఖ్‌ను వెనక్కి తీసుకొచ్చేందుకు మహారాష్ట్ర మంత్రి సుధీర్ ముంగంటివార్ ప్రత్యేకంగా చొరవ తీసుకున్నారు.ఈ క్రమంలోనే కేంద్ర, రాష్ర ప్రభుత్వాల సాయంతో అక్కడి విక్టోరియా, ఆల్బర్ట్ మ్యూజియంతో చర్చలు జరిపి గతేడాది ఓ అవగాహనా ఒప్పందంపై సంతకాలు చేశారు.ఈ ఏడాది చివరిలో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ.వాఘ్‌నఖ్ అంశం శివసేన (షిండే వర్గం)కు కలిసొస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube