ప్రస్తుతం టాలీవుడ్ లో ముగ్గురు డైరెక్టర్ల పేర్లు మార్మోగుతున్నాయి.వారు సందీప్ వంగా, నాగ్ అశ్విన్, హను రాఘవపూడి.
అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలతో సందీప్ రెడ్డి వంగా టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా భారతదేశం వ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకున్నాడు.మహానటి, కల్కి AD 2898 సినిమాలతో నాగ్ అశ్విన్ టాప్ డైరెక్టర్ అయిపోయాడు.
మరోవైపు హను రాఘవపూడి అందాల రాక్షసి, కృష్ణ గాడి వీర ప్రేమ గాధ, సీతా రామం సినిమాలతో స్టార్ డైరెక్టర్ గా మారాడు.వీళ్లు తీసింది కొన్ని సినిమాలే అయినా టాలీవుడ్ ప్రేక్షకులపై చాలా బలమైన ఇంప్రెషన్ కలిగించారు.
ఇప్పుడు వీరి పేర్లు తెలియని తెలుగు సినిమా ప్రేక్షకుడు ఉండడంటే అతిశయోక్తి కాదు.అయితే వీరందరూ దర్శకుడిగా మారకముందు అసిస్టెంట్ డైరెక్టర్లుగా పని చేశారు.
డైరెక్షన్లో మంచి మెలకువలు నేర్చుకున్న తర్వాతే సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టారు.వీళ్లు ఏ దర్శకుల వద్ద ఏ సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్లుగా పని చేశారో తెలుసుకుందాం.
సందీప్ రెడ్డి వంగా

సందీప్ రెడ్డి(Sandeep Reddy Vanga ) సినిమాలు మిగతా సినిమాలకు చాలా భిన్నంగా ఉంటాయి.ఇతడి మూవీల్లో హీరోలు అగ్రేసివ్గా, బోల్డ్‌గా ఉంటారు.కథ చెప్పే విధానం కూడా హార్డ్ హిట్టింగ్‌గా ఉంటుంది.ఇతర డైరెక్టర్లు చూపించడానికి భయపడే వైలెన్స్, రొమాంటిక్ సీన్స్ చూపించగలడు.రామ్ గోపాల్ వర్మ తర్వాత మళ్లీ అంతటి కాంట్రవర్షల్ డైరెక్టర్ గా సందీప్ రెడ్డి అవతరించాడు.అయితే ఈ డైరెక్టర్ కెరీర్ తొలినాళ్లలో నాగార్జున హీరోగా నటించిన కేడి సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు.
ఈ మూవీకి కిరణ్ కుమార్ దర్శకుడిగా వ్యవహరించాడు.దీని తర్వాత శర్వానంద్ హీరోగా చేసిన “మళ్లీ మళ్లీ ఇది రాని రోజు( Malli Malli Idi Rani Roju )” సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేశాడు.
ఈ మూవీని క్రాంతి మాధవ్ రూపొందించాడు.తర్వాత అర్జున్ రెడ్డితో సందీప్ డైరెక్టర్ గా మారాడు.
నాగ్ అశ్విన్

నాగ అశ్విన్( Nag Ashwin ) మొదటగా శేఖర్ కమ్ముల వద్ద వర్క్ చేశాడు.లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ సినిమా ఎలా తీయాలో తెలుసుకున్నాడు.ఆ అనుభవంతో “ఎవడే సుబ్రహ్మణ్యం” సినిమా తీసి హిట్ అందుకున్నాడు.
హను రాఘవపూడి
ఈ దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి( Chandra Sekhar Yeleti ) వద్ద పనిచేస్తూ సినిమా ఎలా తీయాలో నేర్చుకున్నాడు.చంద్రశేఖర్ ఎప్పుడు విభిన్న కథాంశాలతో ప్రేక్షకుల ముందుకు వస్తుంటాడు.అలా హను రాఘవపూడి విభిన్నమైన సినిమాలు ఎలా తీయాలో కూడా తెలుసుకున్నాడు.