అంబానీ ఇంట జరిగిన పెళ్లి గురించి దేశవ్యాప్తంగా చర్చ జరిగిన సంగతి తెలిసిందే. 5000 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ పెళ్లి వేడుక జరగగా ఈ ఖర్చు గురించి తెలిసి నెటిజన్లు ఆశ్చర్యానికి గురయ్యారు.
జియో రీఛార్జ్ ప్లాన్స్ ధరలను పెంచడానికి అంబానీ ఇంట జరిగిన పెళ్లి వేడుకే కారణమని చాలామంది భావించారు.టాలీవుడ్ నటి జ్యోతిరెడ్డి అంబానీ ఇంట జరిగిన పెళ్లి గురించి కామెంట్స్ చేయగా ఆ కామెంట్స్ వైరల్ అయ్యాయి.

2018 సంవత్సరం నుంచి తాను జియో వాడుతున్నానని క్రమం తప్పకుండా బిల్స్ కూడా చెల్లిస్తున్నానని ఆమె వెల్లడించారు.తాను అంబానీ బంధువుని కాదా అని ఆమె అభిప్రాయపడ్డారు.జియో వాడుతున్న వాళ్లంతా అంబానీ చుట్టాలు కాదా అని జ్యోతిరెడ్డి( Jyothi Reddy ) తెలిపారు.ప్రపంచంలో ఉన్న గొప్పవాళ్లందరినీ అంబానీ ఇంట పెళ్లికి పిలిచారని ఇన్ని సంవత్సరాలుగా జియో వాడుతూ మిమ్మల్ని పోషిస్తున్న మమ్మల్ని ఎందుకు పిలవలేదని ఆమె అన్నారు.

జ్యోతిరెడ్డి కామెంట్లలో సైతం నిజం ఉందని నెటిజన్లు సోషల్ మీడియా( Social media ) వేదికగా అభిప్రాయపడుతున్నారు.జియో ఛార్జీలు విపరీతంగా పెరిగాయని ఆమె వెల్లడించారు.జ్యోతిరెడ్డి సెటైరికల్ గా చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.జ్యోతిరెడ్డి కెరీర్ పరంగా అంతకంతకూ ఎదగాలని అభిమానులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు.జ్యోతిరెడ్డి రెమ్యునరేషన్ సైతం ఒకింత భారీ స్థాయిలో ఉందని తెలుస్తోంది.జ్యోతిరెడ్డి జియో గురించి సెటైర్లు వేస్తూ మరికొన్ని వీడియోలు సైతం చేయడం జరిగింది.
జ్యోతిరెడ్డి సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నారు.జ్యోతిరెడ్డి జియోపై బాగానే సెటైర్లు వేశారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
జియో టారిఫ్ ప్లాన్లను పెంచడంతో ఇతర సంస్థలు సైతం ఛార్జీలను ఊహించని స్థాయిలో పెంచడం జరిగింది.జియో ఛార్జీలు పెరగడం గురించి కస్టమర్ల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది.







