వైట్ స్కిన్ టోన్ కోసం ఆరాటపడే వారికి బెస్ట్ హోమ్ మేడ్ సీరం ఇది!

మనలో చాలా మందికి తెల్ల తోలుపై మ‌క్కువ ఎక్కువ.వైట్ స్కిన్ టోన్ ( White skin tone )కోసం ఆరాటపడుతూ రకరకాల చర్మ ఉత్పత్తులను వాడుతుంటారు.

 This Is The Best Homemade Serum For White Skin Tone! White Skin Tone, Homemade S-TeluguStop.com

స్కిన్ వైట్నింగ్ క్రీముల కోసం ప్రతినెలా వేలకు వేలు ఖర్చు పెడుతుంటారు.కానీ ఇప్పుడు చెప్పబోయే న్యాచురల్ సీరం ను తయారు చేసుకుని వాడితే భారీ ఖర్చు లేకుండానే వైట్ స్కిన్ టోన్ ను మీ సొంతం చేసుకోవచ్చు.

పైగా ఈ సీరంలో కెమికల్స్ ఉండవు.కాబట్టి రెగ్యులర్ గా వాడినా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.

Telugu Tips, Skin, Homemade Serum, Latest, Skin Care, Skin Care Tips, Skin Serum

ఇక సీరంను ఎలా తయారు చేసుకోవాలో కూడా ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక చిన్న బీట్ రూట్( Beet root ) ను తీసుకుని పీల్ తొలగించి వాటర్ తో శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న బీట్ రూట్ ముక్కలు, రెండు టేబుల్ స్పూన్లు స్వీట్ ఆల్మండ్ ఆయిల్( Sweet almond oil ), పావు కప్పు బియ్యం కడిగిన వాటర్, పావు కప్పు రోజ్ వాటర్( Rose water ), ఒక టీ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ వేసుకుని మెత్తగా గ్రాండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్ట్రైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

Telugu Tips, Skin, Homemade Serum, Latest, Skin Care, Skin Care Tips, Skin Serum

ఈ జ్యూస్ లో రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్ ( Aloe vera gel )వేసి బాగా మిక్స్ చేస్తే మన సీరం అనేది రెడీ అవుతుంది.ఈ సీరం ను ఒక బాటిల్ లో నింపుకొని స్టోర్ చేసుకోవాలి.రోజు నైట్ నిద్రించే ముందు ముఖానికి మేకప్ ఉంటే తొలగించి ఫేస్ వాష్ చేసుకోవాలని.ఆపై తయారు చేసుకున్న సీరం ను అప్లై చేసుకుని సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.

రెగ్యుల‌ర్ గా ఈ హోమ్ మేడ్ సీరం వాడితే కొద్దిరోజుల్లోనే మీ స్కిన్ కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది.స్కిన్ టోన్ క్రమంగా పెరుగుతుంది.చర్మం తెల్లగా కాంతివంతంగా మారుతుంది.అలాగే ఈ సీరంను వాడటం వల్ల చర్మం పై మొండి మచ్చలు ఉంటే మాయమవుతాయి.

చర్మం స్మూత్ గా తయారవుతుంది.సూపర్ షైనీ గా మెరుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube