పాలు( milk ) ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు.చాలా మంది ఉదయం వేళ పాలు తాగుతుంటారు.
ఉదయం కన్నా నైట్ నిద్రించే ముందు పాలు తాగడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు పొందుతారు.అందులోనూ పాలలో ఒక టీ స్పూన్ ఆవు నెయ్యి ( Cow ghee )కలిపి తాగితే మీ ఆరోగ్యానికి తిరుగే ఉండదు.
పాలు మరియు నెయ్యి అల్టిమేట్ కాంబినేషన్ అని చెప్పవచ్చు.ఈ రెండిటి కలయిక మీ శరీరంలో అద్భుతాలను సృష్టిస్తుంది.
పడుకోవడానికి అర గంట లేదా గంట ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలల్లో ( warm milk )ఒక టీ స్పూన్ ఆవు నెయ్యి కలిపి తాగడం వల్ల నిద్రలేమి సమస్య దూరమవుతుంది.పడుకోగానే నిమిషాల్లో నిద్రలోకి జారుకుంటారు.
నిద్ర నాణ్యత పెరుగుతుంది.అలాగే నెయ్యి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి కొవ్వుల యొక్క గొప్ప మూలం.
ఈ ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు మెదడు ఆరోగ్యానికి దోహదం చేస్తాయి.జ్ఞాపకశక్తిని, ఆలోచన శక్తిని పెంచుతాయి.
పాలు, నెయ్యి.ఈ రెండిటికి కాంబినేషన్ కీళ్లలో మంటను తగ్గించడంలో సహాయపడుతుంది.కీళ్ల నొప్పులను( Joint pains ) దూరం చేయడంలో మరియు ఎముకలను బలోపేతం చేయడంలో తోడ్పడుతుంది.ఒక గ్లాసు పాలల్లో ఒక టీ స్పూన్ స్వచ్ఛమైన ఆవు నెయ్యి కలిపి రోజూ నైట్ తీసుకుంటే జీర్ణక్రియను మెరుగుపడుతుంది.
జీర్ణ వ్యవస్థ నుండి హానికరమైన టాక్సిన్లను తొలగిపోతాయి.మలబద్ధకం సమస్య పరార్ అవుతుంది.
అంతేకాదు, పాలల్లో నెయ్యి కలిపి తాగడం వల్ల ఒత్తిడి తగ్గు ముఖం పడుతుంది.మైండ్ రిలాక్స్ గా మారుతుంది.డిప్రెషన్ బారిన పడే అవకాశాలు తగ్గుతాయి.నెయ్యి మరియు పాల కలయిక చర్మ ఆరోగ్యానికి సైతం అండంగా నిలుస్తుంది.నెయ్యి, పాలు చర్మాన్ని హైడ్రేట్ చేయడానికి మరియు చర్మ మెరుపును పునరుద్ధరించడానికి అద్భుతంగా సహాయపడుతుంది.చర్మంపై మొటిమలను కూడా నయం చేస్తుంది.