చలికాలంలో శరీరాన్ని చురుగ్గా ఉంచే ఉత్తమ ఆహారాలు ఇవే!

ప్రస్తుత చలికాలంలో వయసుతో సంబంధం లేకుండా దాదాపు అందరిని బద్ధకం విపరీతంగా వేధిస్తుంటుంది.ఈ బద్ధకం కారణంగా ఎన్నో పనులు ఆగిపోతుంటాయి.

 These Are The Best Foods To Keep The Body Active During Winters, Best Foods, Win-TeluguStop.com

బ‌ద్ధ‌కం వ‌ల్ల వ్యాయామాల‌ను నిర్ల‌క్ష్యం చేస్తుంటారు.దాంతో బ‌రువు పెరుగుతారు.

బ‌రువు పెరిగితే మ‌ధుమేహం, గుండె పోటు, ర‌క్త‌పోటు త‌దిత‌ర వ్యాధుల‌న్నీ వ‌చ్చే అవ‌కాశాలు పెరుగుతాయి.అందుకే వీట‌న్న‌టికీ కార‌ణం అయిన బ‌ద్ధ‌కాన్ని మొద‌ట చెక్ పెట్టాలి.

అయితే బద్ధ‌కాన్ని తరిమి కొట్టి శరీరాన్ని చురుగ్గా మార్చడానికి కొన్ని కొన్ని ఆహారాలు అద్భుతంగా సహాయపడతాయి.అటువంటి ఉత్తమ ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

చియా సీడ్స్.శరీరాన్ని చురుగ్గా మార్చడంలో ఇవి గ్రేట్ గా సహాయపడతాయి.వెయిట్ లాస్ కు సైతం అద్భుతంగా ఉప‌యోగ‌ప‌డ‌తాయి.ప్ర‌తి రోజు ఉదయాన్ని ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటితో వన్ టేబుల్ స్పూన్ నానబెట్టుకున్న చియా సీడ్స్, వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకొని సేవిస్తే బాడీ ఎన‌ర్జిటిక్ గా మారుతుంది.

బ‌ద్ధ‌కం క్ష‌ణాల్లో పరార్ అవుతుంది.

అలాగే శరీరాన్ని చురుగ్గా మరియు శక్తివంతంగా మార్చడానికి ఓట్స్ హెల్ప్ చేస్తాయి.ముఖ్యంగా బ్రేక్ ఫాస్ట్ లో ఓట్స్ ను ఏదో ఒక రూపంలో తీసుకుంటే రోజంతా యాక్టివ్‌, ఎనర్జిటిక్ గా ఉంటారు.చలికాలంలో బద్ధ‌కాన్ని తరిమికొట్టి శరీరం యొక్క చురుకుదనాన్ని రెట్టింపు చేయడానికి తృణధాన్యాలు కూడా ఎంత‌గానో సహాయపడతాయి.

చలికాలంలో తృణధాన్యాలను ఆహారంలో భాగం చేసుకుంటే బ‌ద్ధ‌కం దూరం అవ్వ‌డ‌మే కాదు శరీరానికి మరెన్నో ఆరోగ్య లాభాలు లభిస్తాయి.రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.గుండె ఆరోగ్యంగా మారుతుంది.బ‌రువు త‌గ్గుతారు.చలికాలంలో తప్పకుండా తీసుకోవాల్సిన ఆహారాల్లో ఎగ్స్‌ ఒకటి.డైలీ డైట్ లో ఎగ్స్ ను చేర్చుకుంటే బోలెడు హెల్త్ బెనిఫిట్స్ లభిస్తాయి.

అదే సమయంలో బ‌ద్ధ‌కం దరి దాపుల్లోకి రాకుండా ఉంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube