ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీలోనూ బుల్లితెర సెలబ్రిటీలు కూడా పెద్ద ఎత్తున సహజీవనం చేస్తూ గడుపుతున్నారు.ప్రేమలో పడి పెళ్లిళ్లు చేసుకోకుండా సహజీవనం చేస్తున్నారు.
వారికి నచ్చితే పెళ్లి చేసుకోవడం లేదంటే బ్రేకప్ చెప్పుకోవడం అనేది జరుగుతుంది అయితే ఈ కల్చర్ సినిమా సెలబ్రిటీలలో మాత్రమే ఉండేది కానీ ఇప్పుడు బుల్లితెర సెలబ్రిటీలలో కూడా ఎక్కువగా జరుగుతుంది.ఇలా పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేస్తున్నటువంటి బుల్లితెర సెలబ్రిటీల విషయానికి వస్తే ప్రియాంక( Priyanka ) శివకుమార్( Shiva Kumar ) ముందు వరుసలో ఉంటారు.
వీరిద్దరూ మౌనరాగం సీరియల్ ద్వారా ప్రేక్షకులకు పరిచయమయ్యారు.ఈ సీరియల్ లోనే ప్రేమలో పడినటువంటి వీరిద్దరూ ప్రేమ ప్రయాణం కొనసాగిస్తూ బుల్లితెర సీరియల్స్ ద్వారా బిజీగా గడుపుతున్నారు.
ప్రియాంక బిగ్ బాస్( Bigg Boss ) కార్యక్రమానికి వెళ్లి మరింత మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.ఇక త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ పలు సందర్భాలలో చెప్పినప్పటికీ ఇంకా వీరి పెళ్లి గురించి ఎలాంటి క్లారిటీ మాత్రం ఇవ్వడం లేదు.
ఇకపోతే తాజాగా ప్రియాంక జైన్ వరలక్ష్మి వ్రతాన్ని( Varalakshmi Vratam ) పురస్కరించుకొని తన ప్రియుడు శివకుమార్ తో కలిసి ఈ వ్రతం చేయడమే కాకుండా ఆయన పాదాలకు నమస్కరిస్తూ తన ఆశీర్వాదాలు కూడా తీసుకున్నారు.సాధారణంగా ఇలాంటి వ్రతాలు పెళ్లయిన దంపతులు చేస్తూ ఉంటారు అలాగే తన భర్త నుంచి భార్య ఆశీర్వాదాలు తీసుకుంటుంది కానీ ఈమె సహజీవనం చేస్తూనే శివకుమార్ తో కలిసి పూజ చేయడం ఆయన ఆశీర్వాదం తీసుకోవడంతో నేటిజన్స్ ఈ ఫోటోలపై దారుణమైన కామెంట్లు చేస్తున్నారు.
నిజానికి ఇలాంటి వ్రతాలు పెళ్లయిన మహిళలు చేస్తారు కానీ మీరు ఇంకా పెళ్లి చేసుకోలేదు.ఇక పెళ్లి కాని వారు కూడా ఒంటరిగానే మంచి భర్త రావాలని పూజ చేస్తారు.మీరు మాత్రం శివకుమార్ తో కలిసి చేస్తున్నారు.మీరు కలిసే ఉంటున్నారు కలిసే పూజలు, అన్నీ చేస్తున్నారు కానీ పెళ్లి మాత్రం చేసుకోవడం లేదు.పెళ్లి తప్ప అన్ని చేసేస్తున్నారు అంటూ ఓ నేటిజన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.