కోల్ కత్తా ట్రైనీ డాక్టర్( Kolkata Trainee Doctor ) అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున సంచలనంగా మారింది.ఈ ఘటనపై ప్రతి ఒక్కరూ కదం తొక్కుతూ నిందితులకు శిక్ష పడాలని బాధితురాలికి న్యాయం జరగాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇలా ప్రాణం పోసి మనకు పునర్జన్మ నిచ్చే వైద్యురాలి విషయంలో కొందరు దుర్మార్గులు చెడు ఆలోచనలతో తనపై సామూహిక అత్యాచారం చేసి తనని చంపేశారు.ఈ ఘటన దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరిని ఎంతగానో కలిసి వేసింది.
నిందితులు ఎక్కడ ఉన్న వారిని పట్టుకొని దారుణంగా శిక్షించాలని నడిరోడ్డున ఉరితీయాలి అంటూ డిమాండ్లు వ్యక్తం చేస్తున్నారు.
ఇలా ఒక మనిషి పట్ల ఇంత క్రూరంగా వ్యవహరించిన తీరు పై దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కొందరు ఆకతాయిలు మాత్రం తెరువెనక ఉండి ఆ డాక్టర్ ఘటన పట్ల పిచ్చిపిచ్చి కామెంట్లు చేస్తూ పోస్టులు పెడుతున్నారు.అయితే ఈ పోస్టులపై తాజాగా సినీ నటుడు మంచు మనోజ్( Manchu Manoj ) స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా మంచు మనోజ్ స్పందిస్తూ.
మనకు జన్మనిచ్చిన మహిళలకు రక్షణ కల్పించడంలో( Women Security ) విఫలమవడం నా హృదయాన్ని ముక్కలు చేసింది.
స్క్రీన్ వెనకాల ఉండి దారుణమైన కామెంట్లు చేస్తున్న వారిని గుర్తించడంలో విఫలమయ్యాము.ఈ ఘటన గురించి అసభ్యకరమైన కామెంట్లు చేస్తున్న వారిని గుర్తించి వారికి కఠినమైన శిక్ష పడాలని, ఇలాంటి సంస్కృతిని నార్మలైజ్ చేయకుండా జవాబుదారీగా నిలబడాలని కోరుకుంటున్నా అంటూ మనోజ్ ఈ సందర్భంగా డాక్టర్ ఘటన విషయంలో అనుచిత కామెంట్ చేస్తున్న వారిపై ఈయన మండిపడుతూ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.అయితే మన దేశంలో ఎక్కడైనా మహిళల గురించి ఇలాంటి ఘటనలు జరిగితే వాటిని ఖండించడంలో మంచు మనోజ్ ముందు వరుసలో ఉంటారు.
ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు కూడా ఈ ఘటనపై స్పందించిన సంగతి తెలిసిందే.