తరచూ సోషల్ మీడియాలో ఢిల్లీ నగరంలో( Delhi ) అనేక సంఘటనలు చోటు చేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాము.అయితే తాజాగా ట్రాఫిక్ పోలీసుల( Traffic Police ) వాటాలు పంచుకుంటున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చెక్కర్లు కొడుతుంది.
వాస్తవానికి మన తెలుగు సినిమాలలో దొంగలించిన సొమ్ములను దొంగలు వాటాలు పంచుకుంటున్నట్లు అచ్చం అలాగే ఢిల్లీ నగరంలో ట్రాఫిక్ పోలీసులు వాటాలు పంచుకుంటున్నట్లు వీడియో ఒకటి సోషల్ మీడియా లో హల్చల్ చేస్తుంది.ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.
ఢిల్లీలోని ఘాజీపూర్ థ్రిల్ లౌరీ సర్కిల్ చెక్ పోస్ట్ వద్ద వద్ద విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులు తమ వాటాలను పంచుతున్నట్లు సీసీ కెమెరాలో రికార్డ్ అవుతుందన్న విషయం మర్చిపోయి డబ్బులను పంచుకుంటున్నారు.ఈ విషయం చివరకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా చేరగా తీవ్రంగా స్పందించి ఆ ముగ్గురు పోలీస్ అధికారులను సస్పెండ్ చేసేసారు.మరోవైపు., ‘లంచం సొమ్ము( Bribe Money ) పంచుకుంటూ కెమెరాకు చిక్కిన ఇద్దరు అసిస్టెంట్ సబ్- ఇన్‌స్పెక్టర్లు, ఓ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశాం.ప్రాథమిక విచారణ తర్వాత వారిపై చర్యలు తీసుకున్నాం., శాఖాపరమైన విచారణకు ఆదేశించాం అంటూ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు.
ఇక ఆ వీడియోలో ఒక చిన్న పాటి సంభాషణ తర్వాత.తమ వెనుక ఉన్న టేబుల్‌పై నోట్ల కట్టను ఉంచిన వ్యక్తికి పోలీసు సైగలు చేయడం.ఆ వ్యక్తి వెళ్లిన తర్వాత ఓ పోలీసు కూర్చుని డబ్బును లెక్కించడం.మొత్తం ముగ్గురు వాటాలు వేసుకోవడం మనం వీడియోలో చూడవచ్చు.ఇక ఈ వీడియోను చూసిన కొంత మంది నెటిజన్స్ సస్పెన్షన్ కేవలం హాలిడే లాంటిదే, ఇంకొకరు ఢిల్లీలో ఇలాంటివి సర్వసాధారణమని కామెంట్ చేశారు.