ప్రపంచంలో అత్యంత అందమైన దృశ్యం మనిషి నవ్వు.పదిమందిలో నవ్వుతూ మాట్లాడితే ఆ గుర్తింపే వేరు, పదిమందితో నవ్వుతూ మాట్లాడితే పెరిగే సత్సంబంధాలే వేరు.
అందుకే మనిషి నవ్వుతూ ఉండాలి.కాని కొందరు నవ్వుని ఆపుకోవడానికి ప్రయత్నిస్తారు.
దానికి కారణం పచ్చరంగులోకి మారిన పళ్ళే.ఈ సమస్యపై ఇంట్లో ఉండే పోరాడవచ్చు.
* అరటిపండు తొక్కలో మెగ్నేషియం, పొటాషియం దొరుకుతాయి.వాటిలో ఉండే బ్లిచింగ్ గుణాల వలన, పళ్ళపై అరటితొక్క రోజూ రుద్దడం వలన పచ్చ రంగు కాస్త తెల్లగా మారుతుంది.
* పసుపులో సహజమైన పాలిషింగ్ గుణాలు ఉంటాయి.పసుపుతో బ్రష్ చేసుకోవడం వలన కూడా ఫలితం కనిపిస్తుంది.
* ఆపిల్ సైడర్ వెనిగర్ కూడా నేచురల్ బ్లించింగ్ గుణాలను కలిగి ఉంటుంది.బ్యాక్టీరియాను తరిమికొట్టి, తెల్లగా మెరిసిపోయే పళ్ళను మనకు అందిస్తుంది.
* స్ట్రాబెరిలో యాంటిఆక్సిడెంట్స్ బాగా లభిస్తాయి.ఈ ఫలాన్ని ఉపయోగించి పళ్ళను రుద్దినా, మంచి ఫలితాలు కనిపిస్తాయి.
* ప్రతిరోజూ తులసి ఆకులను నమలడం పళ్ళకి ఎంతో మేలు చేస్తుంది.బ్యాక్టీరియాతో పోరాడి, పళ్ళకి ఆరోగ్యాన్ని అందించడంలో తులసి పెద్ద చేయిని అందిస్తుంది.
* నారింజతో పాటు మిగితా సిట్రస్ ఫ్యామిలి పండ్ల తొక్కలలో విటమిన్ డి దండిగా దొరుకుతుంది.పంటిపై ఉన్న మరకలను తొలగించడానికి ఇవి మంచి సాధనాలు.
* పేస్ట్ మానేసి ఉప్పుతో బ్రష్ చేసుకోవడం అలవాటు చేసుకుంటే త్వరలోనే ఫలితం మీ కళ్ళ ముందు ఉంటుంది.