అమెరికా అధ్యక్ష ఎన్నికలు హోరాహోరీగా జరుగుతున్నాయి.డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్ధిగా భారత సంతతి నేత, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ( Kamala Harris )ఖరారయ్యారు.
ఆమె అభ్యర్ధిత్వాన్ని అధికారికంగా ప్రకటించేందుకు డెమొక్రాటిక్ పార్టీ సిద్ధమవుతోంది.త్వరలో చికాగోలో జరగనున్న డెమొక్రాటిక్ నేషనల్ కన్వెన్షన్‌లో ( Democratic National Convention )కమలా హారిస్‌ను పార్టీ అభ్యర్ధిగా లాంఛనంగా ఎన్నుకోనున్నారు.
డెలిగేట్స్, కార్యకర్తలు, జర్నలిస్టులు సహా దాదాపు 50 వేల మంది చికాగోకు చేరుకుంటారని అంచనా.
ఈ నేపథ్యంలో నగర పోలీసులు, సీక్రెట్ సర్వీస్ సిబ్బంది అవసరమైన సన్నాహాలు చేస్తున్నారు.కన్వెన్షన్ సెంటర్ చుట్టూ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.వీధులు, రోడ్లను సుందరంగా అలంకరిస్తున్నారు.
కన్వెన్షన్ సెంటర్‌కు కూతవేటు దూరంలో ఉన్న నిరాశ్రయుల శిబిరాన్ని కూడా తొలగించారు.అలాగే పోలీసులు కాన్స్టిట్యూషనల్ పోలీసింగ్‌పై శిక్షణ పొందారు, కౌంటీ కోర్టులు సామూహిక అరెస్ట్‌లను ఊహించి మరిన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి.
సెక్యూరిటీ జోన్‌కు సమీపంలోని ఉన్న ఆసుపత్రులు అత్యవసర పరిస్ధితులు వేగంగా స్పందించేందుకు సిద్ధమవుతున్నాయి.రాష్ట్ర నేతలు, అధికారులు ఇప్పటికే నగరాన్ని ధ్వంసం చేసినా.
హింసాత్మక ఘటనలకు పాల్పడినా అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు.
ఇదిలాఉండగా.అబార్షన్ హక్కులు, ఎకనామిక్ జస్టిస్, గాజాలో యుద్ధంపై దృష్టిపెట్టాలని ఆశిస్తూ డెమొక్రాట్ నేషనల్ కన్వెన్షన్ జరిగే ప్రాంతంలో నిరసన జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.గత నెలలో మిల్వాకీలో జరిగిన రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్ నుంచి తాము పాఠాలు నేర్చుకున్నామని, చికాగోలోనూ ఇలాంటి పరిణామాలు ఎదురవుతాయని నేతలు భావిస్తున్నారు.
చాలా మంది డెమొక్రాటిక్ పార్టీ కార్యకర్తలు ఇజ్రాయెల్ – హమాస్ యుద్ధంలో తక్షణం కాల్పుల విరమణ ప్రాధాన్యతను నొక్కి చెబుతున్నారు.గాజా యుద్ధం, అబార్షన్ రైట్స్, ఎల్జీబీటీక్యూ హక్కులు ప్రాధానంగా చర్చించే అవకాశం ఉంది.
ఇక్కడ ఏ తప్పు జరిగినా ట్రంప్ విరుచుకుపడే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.