వింటర్ లో తప్పక తీసుకోవాల్సిన బెస్ట్ ఇమ్యూనిటీ షాట్స్ ఇవి.. అస్సలు మిస్ అవ్వకండి!

వింటర్ సీజన్( Winter season ) మొదలైంది.రోజురోజుకు చలి విపరీతంగా పెరుగుతుంది.

 Best Immunity Shots For Good Health During Winter! Immunity Shots, Winter, Healt-TeluguStop.com

అయితే చలికాలంలో సహజంగానే అందరి ఇమ్యూనిటీ సిస్టం వీక్ అవుతుంటుంది.దీంతో జ‌లుబు, ద‌గ్గు, సీజ‌న‌ల్ జ్వ‌రాలు ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటాయి.

అయితే వీటన్నిటికి దూరంగా ఉండాలంటే తప్పకుండా ఇప్పుడు చెప్పబోయే ఇమ్యూనిటీ షాట్స్ ను తీసుకోవాల్సిందే.వింటర్ సీజన్ లో ఇవి మీ ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడతాయి.

సీజనల్ వ్యాధులకు అడ్డుకట్ట వేస్తాయి.మరి ఇంకెందుకు లేటు ఆ ఇమ్యూనిటీ షాట్స్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

Telugu Immunity, Latest-Telugu Health

ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు క్యారెట్ ముక్కలు, రెండు స్పూన్లు అల్లం ముక్కలు( Ginger ) వేసుకోవాలి.అలాగే ఒక నిమ్మ పండును తీసుకొని శుభ్రంగా తొక్క తొలగించి ముక్కలుగా కట్ చేసి వేసుకుని ఒక గ్లాస్ వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఆపై స్టైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకొని చిటికెడు పసుపు కలిపి సేవించాలి.

Telugu Immunity, Latest-Telugu Health

అలాగే మరొక బెస్ట్ ఇమ్యూనిటీ( Immunity ) షాట్ కోసం.మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు బీట్ రూట్ ముక్కలు, అరకప్పు యాపిల్ ముక్కలు, తొక్క‌ తొలగించి కట్ చేసిన ఒక నిమ్మ పండు ముక్కలు వేసుకోవాలి.అలాగే ఒక గ్లాస్ వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఆపై స్ట్రైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకుని నేరుగా సేవించాలి.ఈ రెండు ఇమ్యూనిటీ షాట్స్ ప్రస్తుత చలికాలంలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

రోజుకొకటి చొప్పున వీటిని తీసుకుంటే మీ ఇమ్యూనిటీ పవర్ అద్భుతంగా పెరుగుతుంది.దీంతో జలుబు, దగ్గు, శ్వాస సంబంధిత సమస్యలు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.

అలాగే ఈ రెండు ఇమ్యూనిటీ షాట్స్ వెయిట్ లాస్ కు హెల్ప్ చేస్తాయి.చర్మ ఆరోగ్యాన్ని కాపాడతాయి.

స్కిన్ ను కాంతివంతంగా మెరిసేలా ప్రోత్సహిస్తాయి.అంతేకాదు ఈ ఇమ్యూనిటీ షాట్స్ మీ బాడీని డీటాక్స్ చేస్తాయి.

గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.మరియు చలిని తట్టుకునే సామర్థ్యాన్ని సైతం అందిస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube