ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ( International Cricket Council )తాజాగా క్రికెట్ ఆటగాళ్ల ర్యాంకింగ్స్ జాబితాను రిలీజ్ చేసింది.దక్షిణాఫ్రికా జట్టు స్టార్ స్పిన్నర్ మహారాజ్( Star Spinner Maharaj ) వన్డేల్లో టాప్ బౌలర్ గా నిలిచాడు.
ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు.ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే.
భారత జట్టు ఓపెనర్ శుబ్ మన్ గిల్( Shubman Gill ) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.ఆల్ రౌండర్ విషయానికి వస్తే.
బంగ్లాదేశ్ ప్లేయర్ షకీబ్ అల్ హసన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.ఇటీవలే గత కొన్ని వారాలుగా నెంబర్వన్ బౌలర్ స్థానం ఎప్పటికప్పుడు మారుతూ వస్తోంది.
నవంబర్ ఒకటవ తేదీన పాకిస్తాన్ బౌలర్ షాహీన్ ఆఫ్రిది అగ్రస్థానంలో ఉండగా.నవంబర్ 8వ తేదీ భారత జట్టు పేసర్ మహమ్మద్ సిరాజ్ అగ్రస్థానానికి వెళ్లగా.
తాజాగా దక్షిణాఫ్రికా బౌలర్ మహారాజ్ టాప్ బౌలర్ గా అగ్రస్థానంలో నిలిచాడు.
దక్షిణాఫ్రికా బౌలర్ మహారాజ్ గత మూడు మ్యాచ్లలో 7 వికెట్లు తీశాడు.భారత జట్టు పేసర్ మహమ్మద్ సిరాజ్( Pacer Mohammed Siraj ) మూడు మ్యాచ్లలో ఆరు వికెట్లు తీశాడు.ఈ ఇద్దరు బౌలర్ల మధ్య మూడు రేటింగ్ పాయింట్స్ మాత్రమే తేడా.
కాబట్టి మహారాజ్ అగ్రస్థానంలో.సిరాజ్ రెండవ స్థానంలో నిలిచాడు.
ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే.భారత జట్టు ఓపెనర్ శుబ్ మన్ గిల్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజామ్( Babar Azam ) ను వెనక్కి నెట్టేసిన గిల్, అప్పటినుంచి అగ్రస్థానాన్ని కాపాడుకుంటూ దూసుకెళ్తున్నాడు.
భారత జట్టు స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ( Virat Kohli, Rohit Sharma )నాలుగు ఐదు స్థానాలలో కొనసాగుతున్నారు.డబుల్ సెంచరీ తో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ మ్యాక్స్ వెల్ బ్యాటింగ్ లిస్టులో ఏకంగా 17 స్థానాలు పైకి వచ్చేసాడు.ఆల్ రౌండర్ ర్యాంకింగ్స్ జాబితాలో బంగ్లాదేశ్ ప్లేయర్ షాకీబ్ అల్ హసన్ అగ్రస్థానంలో ఉండగా.
భారత జట్టు ఆల్రౌండర్ రవీంద్ర జడేజా పదవ స్థానంలో ఉన్నాడు.ఈ టోర్నీలో సెమీఫైనల్ మ్యాచులు, ఫైనల్ మ్యాచ్ తర్వాత ఐసీసీ ర్యాంకింగ్స్ జాబితాలో స్థానాలు మారే అవకాశం ఉంది.