1.బండి సంజయ్ కామెంట్స్
టిఆర్ఎస్ వాళ్లు ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ గాళ్లే అని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు.
2.కెసిఆర్ పై టీజేఎస్ అధ్యక్షుడు విమర్శలు
తెలంగాణ రైతులకు న్యాయం చేయలేని కేసీఆర్ దేశంలో రైతులకు ఏం చేస్తారని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం ప్రశ్నించారు.
3.పవన్ పై రోజా కామెంట్స్
పవన్ ఎవరి సైన్యం లోనో దూరి యుద్ధం చేయాలని చూస్తున్నారని , పవన్ వాహనం వారాహీ కాదని, నారహి అని రోజా కామెంట్స్ చేశారు.
4.పర్యటక రంగంలో ఏపీ ది మూడో స్థానం : రోజా
పర్యాటక రంగంలో ఏపీ మూడో స్థానంలో ఉందని 2023లో మొదటి స్థానంలో నిలుపుతామని ఏపీ పర్యటక శాఖ మంత్రి రోజా తెలిపారు.
5.ఉమ్మడి పౌరసత్వ బిల్లును సిపిఐ వ్యతిరేకిస్తోంది : నారాయణ
ఉమ్మడి పౌరసత్వ బిల్లు ఆమోదం పొందితే దేశం ఒక్కటిగా ఉండదని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు .ఉమ్మడి పౌరసత్వ బిల్లును సిపిఐ వ్యతిరేకిస్తాందని నారాయణ చెప్పారు.
6.తెలంగాణ క్యాబినెట్ భేటీ
తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన క్యాబినెట్ భేటీ ప్రారంభమైంది.
7.గుజరాత్ శాసనసభ పక్ష నేతగా భూపేంద్ర పటేల్
గుజరాత్ శాసనసభ పక్ష నేతగా భూపేంద్ర పటేల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
8.బాసర ట్రిపుల్ ఐటి ఐదవ స్నాతకోత్సవం
బాసర ట్రిపుల్ ఐటీ లో 5వ స్నాతకోత్సవంలో మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, హాజరయ్యారు .
9.బీఆర్ఎస్ బీజేపీ కామెంట్స్
కెసిఆర్ కలలు కలలుగానే ఉంటాయని , టిఆర్ఎస్ పార్టీ గుర్తింపు పొందలేదని బిజెపి మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు అన్నారు.
10.బాసర ట్రిపుల్ ఐటి విద్యార్థులకు కేటీఆర్ వరాలు
బాసర ట్రిపుల్ ఐటి ఐదవ స్నాతకోత్సవం లో పాల్గొన్న మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా విద్యార్థులకు అనేక వరాలు ఇచ్చారు.మిషన్ భగీరథ ద్వారా నీరు అందిస్తామని, నాణ్యమైన భోజనం అందిస్తామని ఐదు కోట్లతో సైన్స్ క్లబ్ ఏర్పాటు చేస్తామని కేటీఆర్ ప్రకటించారు.
11.షర్మిల కామెంట్స్
ముఖ్యమంత్రి కెసిఆర్ నియంతల వ్యవహరిస్తున్నారని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు.
12.ఇసుక అక్రమ తవ్వకాలపై హైకోర్టు సీరియస్
కడప జిల్లాలో అక్రమ ఇసుక తవ్వకాలపై దాఖలైన పిటీషన్ పై విచారణ చేసిన హైకోర్టు ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.నిపుణుల కమిటీతో విచారించి మూడు వారాల్లో నివేదిక సమర్పించాలని కడప జిల్లా కలెక్టర్ కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
13.బిజెపిని నిలువరించే సత్తా బీఆర్ఎస్ కే ఉంది
బిజెపి ని నిలువరించే సత్తా టిఆర్ఎస్ కు మాత్రమే ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు.
14.బెంగళూరుకు 921 ఎలక్ట్రిక్ బస్సులు
కేంద్ర ప్రభుత్వ సేమ్ టు 11 లో భాగంగా సిఇఎస్ఎల్ ద్వారా కొత్తగా బెంగళూరు నగరానికి 921 ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేసినందుకు మంత్రి మండలి అంగీకారం తెలిపింది.
15.తిరుమలలో భారీ వర్షాలు
మాండౌస్ తుఫాను ప్రభావంతో తిరుమలలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
16.వైసిపి అధికారిక ట్విట్టర్ ఖాతా హ్యాక్
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతా హ్యాకింగ్ కు గురైంది.
17.ప్రభుత్వం దిగివచ్చేదాకా దీక్షను ఆపను : షర్మిల
తన పాదయాత్రకు అనుమతి ఇచ్చే విషయంలో ప్రభుత్వం దిగివచ్చే వరకు తన దీక్షను ఆపేదే లేదని వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు.
18.పెన్నా నదిలో చిక్కుకున్న ఐదుగురు
పెన్నా నదిలో ఐదుగురు చిక్కుకున్నారు.నది మధ్యలో ఇసుక దిబ్బలపై వాళ్లు ఉండడం గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు.
19.తుఫాను పై సీఎం జగన్ సమీక్ష
మాండూస్ తుఫాన్ ప్రభావంతో ఏపీవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులతో ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.
20.బి ఆర్ ఎస్ ప్రకటన కోర్టు దిక్కరణే : రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర సమితిగా మారుస్తూ తీసుకున్న నిర్ణయం కోర్టు ధిక్కారం కిందకే వస్తుందని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు.