భారత సంతతికి చెందిన టెక్కీ, ఓపెన్ ఏఐ మాజీ ఉద్యోగి సుచీర్ బాలాజీ( Suchir Balaji ) మరణం టెక్ ప్రపంచాన్ని ఓ కుదుపు కుదుపుతోంది.అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలోని( San Francisco ) తన అపార్ట్‌మెంట్‌లో సుచీర్ బలవన్మరణానికి పాల్పడినట్లుగా అమెరికన్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.అయితే పరిస్ధితులు మాత్రం అనేక అనుమానాలు కలిగిస్తున్నాయి.2020 నుంచి 2024 వరకు నాలుగేళ్ల పాటు ఓపెన్ ఏఐలో( Open AI ) పనిచేసిన సుచీర్.ఈ ఏడాది ఆగస్టులో ఆ కంపెనీని వీడారు.అనంతరం ఓపెన్ ఏఐ, చాట్ జీపీటీలపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
డేటాను సేకరించడం కోసం ఓపెన్ ఏఐ అనుసరిస్తున్న విధానం అత్యంత ప్రమాదకరమైనదని.ఇది వ్యాపారాలు, వ్యాపారవేత్తలకు మంచిది కాదని సుచీర్ బాలాజీ అన్నారు.ఛాట్ జీపీటీ( Chat GPT ) లాంటి టెక్నాలజీలు ఇంటర్నెట్‌ను నాశనం చేయడంతో పాటు ఇవి అమెరికా కాపీ రైట్ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాయని ఆరోపించాడు.ఈ క్రమంలోనే సుచీర్ అనుమానాస్పద స్థితిలో శవమై తేలడం కలకలం రేపుతోంది.
ఆయన మరణంపై టెస్లా , స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్( Elon Musk ) కూడా కీలక వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది.
తాజాగా సుచీర్ తండ్రి బాలగి రామమూర్తి( Balagi Ramamurthy ) తన కుమారుడి మరణం గురించి మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.తన బిడ్డ మరణం వెనుక కుట్ర కోణం ఉందని, ఎఫ్‌బీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.అంతేకాదు ఈ ఘటనపై దర్యాప్తు కోసం తాము ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్‌ను నియమించుకున్నట్లుగా తెలిపారు.
ఈ జనవరిలో బాలాజీని చూడాలని తాము ప్లాన్ చేసుకున్నామని కానీ, అంతలోనే ఈ ఘోరం జరిగిపోయిందని రామమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు.సుచీర్‌తో చివరిసారిగా మాట్లాడిన వ్యక్తిని తానేనని , ఆ సమయంలో బాలాజీ ఎంతో సంతోషంగా ఉన్నాడని అతనిలో నిరాశ కనిపించలేదని పేర్కొన్నారు.
ఘటనాస్థలంలో సూసైడ్ నోట్ లభించలేదని.తాము బాత్రూమ్‌లో రక్తపు మరకలు, గొడవ జరిగిన ఆనవాళ్లని గమనించామని రామమూర్తి తెలిపారు.
మరోవైపు సుచీర్ మరణంపై టెక్ ప్రపంచం, నెటిజన్లు అండగా నిలిచారు.