చివరిసారిగా మాట్లాంది నేనే .. కొడుకు మరణంపై సుచీర్ బాలాజీ తండ్రి ఆవేదన
TeluguStop.com
భారత సంతతికి చెందిన టెక్కీ, ఓపెన్ ఏఐ మాజీ ఉద్యోగి సుచీర్ బాలాజీ( Suchir Balaji ) మరణం టెక్ ప్రపంచాన్ని ఓ కుదుపు కుదుపుతోంది.
అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలోని( San Francisco ) తన అపార్ట్‌మెంట్‌లో సుచీర్ బలవన్మరణానికి పాల్పడినట్లుగా అమెరికన్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
అయితే పరిస్ధితులు మాత్రం అనేక అనుమానాలు కలిగిస్తున్నాయి.2020 నుంచి 2024 వరకు నాలుగేళ్ల పాటు ఓపెన్ ఏఐలో( Open AI ) పనిచేసిన సుచీర్.
ఈ ఏడాది ఆగస్టులో ఆ కంపెనీని వీడారు.అనంతరం ఓపెన్ ఏఐ, చాట్ జీపీటీలపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
"""/" /
డేటాను సేకరించడం కోసం ఓపెన్ ఏఐ అనుసరిస్తున్న విధానం అత్యంత ప్రమాదకరమైనదని.
ఇది వ్యాపారాలు, వ్యాపారవేత్తలకు మంచిది కాదని సుచీర్ బాలాజీ అన్నారు.ఛాట్ జీపీటీ( Chat GPT ) లాంటి టెక్నాలజీలు ఇంటర్నెట్‌ను నాశనం చేయడంతో పాటు ఇవి అమెరికా కాపీ రైట్ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాయని ఆరోపించాడు.
ఈ క్రమంలోనే సుచీర్ అనుమానాస్పద స్థితిలో శవమై తేలడం కలకలం రేపుతోంది.ఆయన మరణంపై టెస్లా , స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్( Elon Musk ) కూడా కీలక వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది.
"""/" /
తాజాగా సుచీర్ తండ్రి బాలగి రామమూర్తి( Balagi Ramamurthy ) తన కుమారుడి మరణం గురించి మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తన బిడ్డ మరణం వెనుక కుట్ర కోణం ఉందని, ఎఫ్‌బీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.
అంతేకాదు ఈ ఘటనపై దర్యాప్తు కోసం తాము ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్‌ను నియమించుకున్నట్లుగా తెలిపారు.
ఈ జనవరిలో బాలాజీని చూడాలని తాము ప్లాన్ చేసుకున్నామని కానీ, అంతలోనే ఈ ఘోరం జరిగిపోయిందని రామమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు.
సుచీర్‌తో చివరిసారిగా మాట్లాడిన వ్యక్తిని తానేనని , ఆ సమయంలో బాలాజీ ఎంతో సంతోషంగా ఉన్నాడని అతనిలో నిరాశ కనిపించలేదని పేర్కొన్నారు.
ఘటనాస్థలంలో సూసైడ్ నోట్ లభించలేదని.తాము బాత్రూమ్‌లో రక్తపు మరకలు, గొడవ జరిగిన ఆనవాళ్లని గమనించామని రామమూర్తి తెలిపారు.
మరోవైపు సుచీర్ మరణంపై టెక్ ప్రపంచం, నెటిజన్లు అండగా నిలిచారు.
నా దృష్టిలో ఓజీ అంటే అతను మాత్రమే… రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు!